News April 7, 2025
ప్రజావాణిలో 106 దరఖాస్తులు: కలెక్టర్ ప్రావీణ్య

వివిధ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందించిన వినతులను వెంటనే పరిష్కరించాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి 106 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ తెలిపారు. ప్రజలు అందించిన వినతులను సంబంధిత శాఖల అధికారులు స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు.
Similar News
News April 8, 2025
చైనాను హెచ్చరించిన ట్రంప్

చైనాకు ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. తమపై విధించిన 34శాతం టారిఫ్‌ను వెనక్కి తీసుకోకపోతే డ్రాగన్ దేశంపై మరో 50శాతం సుంకం విధిస్తామని అల్టిమేటం జారీ చేశారు. రేపటికల్లా పన్నుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. లేకపోతే ఏప్రిల్ 9నుంచి చైనా దిగుమతులపై అదనపు పన్ను ఉంటుందన్నారు. ట్రంప్ డ్రాగన్ వస్తువులపై 34శాతం టారిఫ్‌లు వేయగా, బీజింగ్ సైతం అంతే మెుత్తంలో US దిగుమతులపై సుంకాలు విధించింది.
News April 8, 2025
కేంద్ర మంత్రికి స్మార్ట్ సిటీ పనుల పురోగతిని వివరించిన కమిషనర్

కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ & అర్బన్ ఎఫైర్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్మార్ట్ సిటీ అభివృద్ధి పురోగతిపై ఢిల్లీ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో బల్దియా కమిషనర్ డా.అశ్విని తానాజీ వాకడే పాల్గొన్నారు. నగరంలో స్మార్ట్ సిటీ కింద చేపట్టి కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిని కమిషనర్ మంత్రి మనోహర్ లాల్ కట్టర్‌కి వివరించారు.
News April 8, 2025
ఫెయిలైన విద్యార్థులకు గుడ్ న్యూస్

TG: డిగ్రీలో ఫెయిలైన విద్యార్థులకు జేఎన్టీయూ శుభవార్త చెప్పింది. అన్ని కోర్సుల్లో ఫెయిలైన విద్యార్థుల కోసం వన్ టైమ్ ఛాన్స్ (స్పెషల్ సప్లిమెంటరీ) పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ ఏడాది మే, జూన్ నెలల్లో ఈ పరీక్షలు జరుగుతాయని వెల్లడించింది. www.jntuh.ac.in సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలంది. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది.