News April 8, 2025
ఫెయిలైన విద్యార్థులకు గుడ్ న్యూస్

TG: డిగ్రీలో ఫెయిలైన విద్యార్థులకు జేఎన్టీయూ శుభవార్త చెప్పింది. అన్ని కోర్సుల్లో ఫెయిలైన విద్యార్థుల కోసం వన్ టైమ్ ఛాన్స్ (స్పెషల్ సప్లిమెంటరీ) పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ ఏడాది మే, జూన్ నెలల్లో ఈ పరీక్షలు జరుగుతాయని వెల్లడించింది. www.jntuh.ac.in సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలంది. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది.
Similar News
News April 23, 2025
3 లక్షల గృహాలకు ప్రారంభోత్సవాలు.. ఎప్పుడంటే?

AP: రాష్ట్రవ్యాప్తంగా పేదల ఇళ్ల నిర్మాణాలను ప్రభుత్వం వేగవంతం చేసింది. జూన్ 12కు ఏడాది పాలన పూర్తవుతున్న నేపథ్యంలో 3 లక్షల ఇళ్లకు ప్రారంభోత్సవాలు చేయాలని నిర్ణయించింది. పనులు చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అర్హులైన వారికి గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల చొప్పున స్థలం మంజూరు చేసేందుకు అధికారులు సర్వే చేస్తున్నారు.
News April 23, 2025
పహల్‌గామ్‌లో అనుమానాస్పద బైక్ గుర్తింపు

జమ్మూకశ్మీర్ పహల్‌గామ్ ఉగ్రదాడి ఘటన విచారణలో భద్రతా బలగాలు పురోగతి సాధించాయి. పహల్‌గామ్ సమీపంలో నంబర్ ప్లేట్ లేని బైక్‌ను గుర్తించాయి. టెర్రరిస్టులు దీన్ని ఉపయోగించినట్లు అనుమానిస్తున్నాయి. బైక్‌ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నాయి. మరోవైపు ఘటనా స్థలానికి ఇవాళ ఎన్ఐఏ బృందాలు చేరుకోనున్నాయి.
News April 23, 2025
చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్

IPLలో అత్యంత వేగంగా 130 ఇన్నింగ్స్‌ల్లోనే 5,000 పరుగులు చేసిన ప్లేయర్‌గా ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ కేఎల్ రాహుల్ చరిత్ర సృష్టించారు. నిన్న LSGతో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ(57*) చేయడం ద్వారా ఈ ఘనత సాధించారు. ఆ తర్వాతి స్థానాల్లో డేవిడ్ వార్నర్(135Inns), విరాట్ కోహ్లీ(157Inns), డివిలియర్స్(161Inns), ధవన్(168Inns) ఉన్నారు.