News February 2, 2026
ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించండి: జిల్లా కలెక్టర్

ప్రజాసమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హరిచందన అధికారులను ఆదేశించారు. వాట్సాప్ ద్వారా వచ్చే దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణిలో DRO వెంకటాచారితో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 414 దరఖాస్తులు అందాయని, హౌసింగ్- 329, రెవెన్యూ- 57, ఇతర శాఖలకు 28 ఫిర్యాదులు వచ్చాయన్నారు. పెండింగ్ లేకుండా అర్జీలను పరిష్కరిస్తామన్నారు.
Similar News
News April 20, 2026
కొడంగల్: CM ఇలాకాలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో రూ.224 కోట్లతో 450 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తున్నారు. కాగా, రాష్ట్రంలోని పెద్ద సర్కార్ దవాఖానాలైన గాంధీ (2,000+ పడకలు), ఉస్మానియా (1,168+ పడకలు) తర్వాత, ప్రాంతీయ స్థాయిలో ఇంతటి ఆధునిక వైద్యశాల రావడం ఇదే తొలిసారి. ఈ భారీ నిర్మాణం పూర్తయితే కొడంగల్‌తో పాటు పరిసర జిల్లాలకు ఎంతో ఉపయోగపడనుంది.

HYDలో త్వరలో మరో IVF సెంటర్

HYD హైకోర్టు సమీపంలోని పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రిలో త్వరలో IVF కేంద్రం అందుబాటులోకి రానుంది. గాంధీ ఆసుపత్రిలో IVF సెంటర్ సక్సెస్ అయిన నేపథ్యంలో ఇక్కడా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు DME నరేందర్ కుమార్ తెలిపారు. సుమారుగా 490 పడకల సామర్థ్యంతో, డాక్టర్లతో అద్భుతమైన సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రెగ్నెన్సీ పరీక్షలు చేయడం, పసిపిల్లలకు వైద్యం, పిల్లల తల్లులకు అడ్వాన్స్‌డ్ వైద్యం అందించనున్నారు.