News January 31, 2026
ప్రత్యేక సమగ్ర సవరణను పకడ్బందీగా నిర్వహించాలి: SEC

ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి సూచించారు. శనివారం రాష్ట్ర ఎన్నికల అధికారి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా అధికారులు పాల్గొన్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు వారి తరపున ప్రతి పోలింగ్ కేంద్రానికి బూత్ స్థాయి ఏజెంట్లను నియమించాలని సూచించారు. పెండింగ్ ఫారం 6, 6ఏ, 7, 8లను త్వరితగతిన పరిష్కరించాలన్నారు.
Similar News
News April 20, 2026
KMM: మొక్కజొన్న కొనుగోళ్లపై కలెక్టర్లకు మంత్రి తుమ్మల ఆదేశాలు

మొక్కజొన్న కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చోట అదనపు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మార్క్ఫెడ్ ద్వారా 200 కేంద్రాల్లో కొనుగోళ్లు కొనసాగుతున్నాయని తెలిపారు. కొనుగోలు చేసిన మొక్కజొన్నను వెంటనే గోదాములకు తరలించేలా చర్యలు తీసుకోవాలని మార్క్ఫెడ్ అధికారులను సూచించారు.

అందుబాటులోకి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే

జిల్లా ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే (ప్యాకేజీ-2) సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. వైరా మండలంలోని సోమవరం ఎగ్జిట్ పాయింట్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని దేవరపల్లి వరకు నిర్మించిన ఈ రహదారిని అధికారులు ప్రారంభించారు. నేటి నుంచి టోల్ వసూళ్లు మొదలయ్యాయి. కాగా, ఈ రహదారిపై ద్విచక్ర వాహనాలు, ఆటోలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.