News January 20, 2026
ఫ్రెంచ్ వైన్‌పై 200% టారిఫ్‌లు వేస్తా.. మాక్రాన్‌పై ట్రంప్ ఫైర్

గాజా శాంతి కోసం ప్రతిపాదించిన ‘Board of Peace’లో చేరడానికి ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ సుముఖంగా లేరన్న వార్తలపై ట్రంప్ తనదైన స్టైల్లో రియాక్ట్ అయ్యారు. ‘ఆయన ఎలాగూ త్వరలో పదవి నుంచి తప్పుకొంటున్నారు. ఆయన అవసరం ఎవరికీ లేదు. కానీ పీస్ బోర్డులో చేరకపోతే ఫ్రెంచ్ వైన్, షాంపైన్‌లపై 200% టారిఫ్ వేస్తా. అప్పుడు ఆయనే దారిలోకి వస్తారు’ అంటూ బెదిరించారు. ట్రంప్ టారిఫ్‌ల అస్త్రం వాడటం పరిపాటిగా మారింది.
Similar News
News March 3, 2026
ఏ పంటల్లో ఎలాంటి ఎర పంటలను వేస్తే మంచిది?

☛ పత్తి, వేరుశనగ చుట్టూ ఆముదపు పంటను ఎర పంటగా వేసి పొగాకు లద్దె పురుగుల్ని, బంతి మొక్కలు వేసి శనగ పచ్చపురుగులను నివారించవచ్చు. ☛ క్యాబేజీలో ఆవాల పంటను వేసి డైమండ్ బ్యాక్ మాత్‌ను నివారించవచ్చు. ☛ వేరుశనగలో అలసందలు వేసి ఎర్రగొంగళి పురుగుల ఉద్ధృతి తగ్గించవచ్చు. ☛ అలసందలు పంటలో ఆవాలును ఎర పంటగా వేసి గొంగళిపురుగు, పొద్దుతిరుగుడు మొక్కలను నాటి కాయతొలుచు పురుగులను నివారించవచ్చు.
News March 3, 2026
హోలీ ఆఫర్ల పేరుతో లింక్స్.. క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ!

TG: హోలీ పండగను క్యాష్ చేసుకునేందుకు సైబర్ కేటుగాళ్లు రెడీ అయ్యారు. రంగులు, గిఫ్ట్స్, ఈవెంట్ పాస్‌ల మీద భారీ డిస్కౌంట్లు ఉన్నాయంటూ వాట్సాప్, SMSలలో ఫేక్ లింకులు పంపుతున్నారు. వీటిపై క్లిక్ చేస్తే మీ ఫోన్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్ హెచ్చరించారు. పొరపాటున మోసపోతే వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయాలని ఆమె సూచించారు.
News March 3, 2026
రాష్ట్రంలో మళ్లీ వర్షాలు!

AP: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఆవరించిన ఉపరితల ఆవర్తనం 4 రోజుల్లో ఉపరితల ద్రోణిగా విస్తరించే ఆస్కారముందని వాతావరణశాఖ తెలిపింది. దీంతో ఈ నెల 7వ తేదీ తర్వాత కోస్తాంధ్రలో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. రానున్న 24 గంటల్లో రాష్ట్రంలోని చాలాచోట్ల ఎండ తీవ్రత ఉంటుందని హెచ్చరించింది. అయినా అల్లూరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో పొగమంచు కురుస్తుందని చెప్పింది. ఇక నిన్న దేశంలోనే కర్నూలులో అత్యధికంగా 38°C నమోదైంది.


