News August 12, 2025
బల్లికురవ: కంకర క్వారీలో పడి కార్మికుడి మృతి

బల్లికురవ సమీపంలోని సన కొండల వద్ద మంగళవారం జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. చత్తీస్‌గఢ్ నుంచి ఉపాధి కోసం వలస వచ్చిన సాధు (30) ఓ కంకర క్వారీలో పనిచేస్తున్నాడు. క్వారీలో జాకీతో రంధ్రాలు వేసే క్రమంలో జారి రాళ్లపై పడి మృతి చెందాడు. ఎస్సై నాగరాజు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News April 14, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల ధరల వివరాలు ఇలా.!

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో మంగళవారం బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
*24 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.15,300
*22 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.14.076
*వెండి 10 గ్రాముల ధర రూ.2,470
News April 14, 2026
అరుణాచల్ ప్రదేశ్ మాదే: చైనా

అరుణాచల్ ప్రదేశ్‌లో <<19633032>>గ్రామాల<<>> పేర్లు మార్చడంపై భారత్ నుంచి విమర్శలు ఎదుర్కొన్నా చైనా తగ్గడం లేదు. అరుణాచల్ ప్రదేశ్ భారత భూభాగమే కాదని లేటెస్ట్‌గా ఆ దేశ విదేశాంగ ప్రతినిధి జియాకున్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అరుణాచల్ ప్రదేశ్‌ను భారత్ అక్రమంగా ఏర్పాటు చేసుకుందని, దీనిని చైనా ఎప్పటికీ గుర్తించదన్నారు. అరుణాచల్‌ను జాంగ్‌నాన్ (దక్షిణ టిబెట్)గా పేర్కొంటూ.. ఇది తమ భూభాగమేనని చైనా వాదిస్తోంది.
News April 14, 2026
వెరీ స్లో ఇన్నింగ్స్.. కోహ్లీపై చోప్రా విమర్శలు

ఈనెల 12న ముంబైతో మ్యాచులో RCB ఓపెనర్ విరాట్ కోహ్లీ చాలా స్లోగా ఆడారని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా విమర్శించారు. ‘RCB గెలిచినప్పటికీ T20 క్రికెట్ కోణంలో చూస్తే అది చాలా స్లో ఇన్నింగ్స్. విరాట్ స్థాయికి తగ్గట్లుగా లేదు. ఆయన మైండ్‌సెట్ కూడా సరిగా లేనట్లు అనిపించింది. వైడ్ బాల్స్ కోసం రెండు రివ్యూలు వృథా చేశారు’ అని తన యూట్యూబ్ వీడియోలో పేర్కొన్నారు. ఈ మ్యాచులో కోహ్లీ 38 బంతుల్లో 50 రన్స్ చేశారు.


