News March 28, 2025
బాపట్లలో మానవత్వం చాటుకున్న మంత్రి

రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మానవత్వం చాటుకున్నారు. బాపట్ల పరిధిలో శుక్రవారం ఓ ట్రాక్టర్ అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. అదే సమయానికి అటుగా వస్తున్న మంత్రి దుర్గేష్ వెంటనే స్పందించారు. క్షతగాత్రులను వైద్యశాలకు తరలించారు. డాక్టర్లకు ఫోన్ చేసి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. అదృష్టవశాత్తు ప్రాణనష్టమేమీ జరగలేదని తెలిపారు.
Similar News
News March 31, 2025
గ్రూప్-1లో సత్తాచాటిన సంస్థాన్ నారాయణపురం ఏఓ

సంస్థాన్ నారాయణపురం మండల వ్యవసాయ అధికారిణి కే. వర్షిత గ్రూప్-1లో సత్తాచాటారు. నాలుగు నెలల క్రితం ఏఓగా భాద్యతలు చేపట్టిన వర్షిత గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్స్‌లో రాష్ట్ర స్థాయిలో 100వ ర్యాంక్, మల్టీజోన్-2లో 40 ర్యాంకు సాధించారు. ఇటీవలే ప్రకటించిన గ్రూప్-4లో 143, గ్రూప్-2లో 215వ ర్యాంక్ సాధించి తన ప్రతిభను చాటారు. ఈ జాబ్స్ అన్నీ మొదటి ప్రయత్నంలోనే సాధించడం విశేషం.
News March 31, 2025
కొడాలి నాని హెల్త్ అప్‌డేట్

వైసీపీ నేత కొడాలి నాని హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వారం క్రితం ఛాతినొప్పితో ఆయన ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. డాక్టర్లు వైద్య పరీక్షలు చేసి గుండెకు సంబంధించిన 3 వాల్వ్స్ క్లోజ్ అయినట్లు నిర్ధారించారు. స్టెంట్ లేదా బైపాస్ సర్జరీ చేయాలని సూచించారు. సర్జరీ కోసం కొంత సమయం తీసుకోవాలని కుటుంబసభ్యులు యోచిస్తున్నారు. నానిని ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌కు తరలించే అవకాశం ఉంది.
News March 31, 2025
NGKL: వివాహితపై అత్యాచారం.. ఆ వ్యక్తిదే కీలకపాత్ర!

ఊర్కొండ మండలంలోని పేట ఆంజనేయ స్వామి దేవాలయానికి దర్శనార్థం వచ్చిన<<15944914>> ఓ వివాహితపై జరిగిన అత్యాచార ఘటన<<>> సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించి దేవాలయంలో పనిచేస్తున్న ఓ వ్యక్తి కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. మొత్తం ఎనిమిది మంది సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తుండగా.. పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు తెలుస్తోంది.