News March 31, 2025
కొడాలి నాని హెల్త్ అప్‌డేట్

వైసీపీ నేత కొడాలి నాని హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వారం క్రితం ఛాతినొప్పితో ఆయన ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. డాక్టర్లు వైద్య పరీక్షలు చేసి గుండెకు సంబంధించిన 3 వాల్వ్స్ క్లోజ్ అయినట్లు నిర్ధారించారు. స్టెంట్ లేదా బైపాస్ సర్జరీ చేయాలని సూచించారు. సర్జరీ కోసం కొంత సమయం తీసుకోవాలని కుటుంబసభ్యులు యోచిస్తున్నారు. నానిని ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌కు తరలించే అవకాశం ఉంది.
Similar News
News April 20, 2025
ఈ నెల 23 నుంచి భారత్-అమెరికా వాణిజ్య చర్చలు

ఈ నెల 23 నుంచి 3 రోజుల పాటు వాషింగ్టన్‌లో భారత్, అమెరికా వాణిజ్య చర్చలు జరపనున్నాయి. టారిఫ్స్ నుంచి కస్టమ్స్ వరకు పలు అంశాలపై ఈ చర్చల్లో ఇరు దేశాలు ఓ ఒప్పందానికి వచ్చే అవకాశం ఉంది. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంలో ఉన్న సమస్యలు పరిష్కారం కావొచ్చని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. భారత బృందానికి వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి రాజేశ్ అగ్రవాల్ నేతృత్వం వహించనున్నారు.
News April 20, 2025
‘డయాఫ్రం వాల్’ టెక్నాలజీపై మహారాష్ట్ర అధికారుల ఆరా

AP: పోలవరం ప్రాజెక్టు వద్ద జరుగుతున్న పనులను మహారాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు పరిశీలించారు. స్పిల్ వే, గేట్లు, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు, డయాఫ్రం వాల్, జలవిద్యుత్ కేంద్రాన్ని సందర్శించారు. డయాఫ్రం వాల్ నిర్మాణంలో వాడుతున్న టెక్నాలజీ, ఉపయోగించే యంత్రాల వివరాలను స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. తర్వాత పట్టిసీమ ప్రాజెక్టునూ పరిశీలించారు.
News April 20, 2025
ICICIకి రూ.13,502 కోట్ల నికర లాభం

జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.13,502 కోట్ల నికర లాభం వచ్చినట్లు ICICI ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే 15.7 శాతం మేర నికర లాభం పెరిగినట్లు తెలిపింది. ఈ 3 నెలల్లో నికర వడ్డీ ఆదాయం 11 శాతం పెరిగి రూ.21,193 కోట్లు, వడ్డీయేతర ఆదాయం 18.4 శాతం వృద్ధితో రూ.7,021 కోట్లు నమోదైనట్లు పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరానికి గాను ఒక్కో షేరుకు రూ.11 చొప్పున డివిడెండ్ చెల్లించాలని బ్యాంక్ నిర్ణయించింది.