News February 12, 2025

బిక్కనూర్: చేపల వేటకు వెళ్లి యువకుడి మృతి

image

చేపల వేటకు వెళ్లి యువకుడు మృతి చెందిన ఘటన బిక్కనూర్‌లో వెలుగుచూసింది. 44వ జాతీయ రహదారి పక్కన ఉన్న బొబ్బిలి చెరువులో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు చెరువు వద్ద పరిశీలించగా కుళ్లిన మృతదేహం లభ్యమైనట్లు వెల్లడించారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు మృతదేహాన్ని పంచనామా నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడు చెట్టపల్లి రాజశేఖర్‌గా గుర్తించారు.

Similar News

News February 12, 2025

మేడిపల్లి: 2024లో ట్రాఫిక్ రూల్స్ బ్రేక్.. 292 మంది మృతి

image

ఘట్‌కేసర్, మేడిపల్లి, కీసర, మేడ్చల్, శామీర్‌పేట, జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 2024లో ఏకంగా 683 ప్రమాదాల్లో 292 మంది మృత్యుపాలయ్యారు. అనేక ప్రమాదాల్లో అతివేగంగా ప్రయాణించడం, హెల్మెట్, సీటు బెల్ట్ ధరించకపోవడం, రాంగ్ రూట్ కారణాలుగా పోలీసు అధికారులు తెలిపారు. రోడ్డు ప్రయాణంలో చేసే చిన్నపాటి తప్పిదం ప్రాణాలు తీస్తుందని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని సూచించారు.

News February 12, 2025

Stock Markets: లాభాలు నిలబెట్టుకోలేదు..

image

బెంచ్‌మార్క్ సూచీలు నేడు స్వల్పంగా నష్టపోయాయి. నిఫ్టీ 23,045 (-26), సెన్సెక్స్ 76,171 (-122) వద్ద ముగిశాయి. ఒకానొక దశలో నిఫ్టీ 200, సెన్సెక్స్ 600 Pts మేర నష్టపోయి మళ్లీ పుంజుకోవడం గమనార్హం. PSU బ్యాంకు, ఫైనాన్స్, మెటల్ సూచీలు ఎగిశాయి. ఆటో, ఐటీ, ఫార్మా, రియాల్టి, హెల్త్‌కేర్, O&G సూచీలు ఎరుపెక్కాయి. బజాజ్ ఫిన్‌సర్వ్, ఎస్బీఐ లైఫ్, శ్రీరామ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, టాటా స్టీల్ టాప్ గెయినర్స్.

News February 12, 2025

శుభ్‌మన్ గిల్ ‘శతక’బాదుడు!

image

భారత స్టార్ ఆటగాడు శుభ్‌మన్ గిల్ ఇంగ్లండ్‌తో మూడో వన్డేలో సెంచరీతో కదం తొక్కారు. 95 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నారు. ఇది ఆయనకు 7వ వన్డే సెంచరీ. ఈ సిరీస్‌లో తొలి రెండు వన్డేల్లో గిల్ 87, 60 పరుగులతో రాణించిన సంగతి తెలిసిందే. కాగా.. భారత్ స్కోరు ప్రస్తుతం 206/2గా ఉంది. మరో ఎండ్‌లో శ్రేయస్ అయ్యర్ 43(36 బంతుల్లో) కూడా ధాటిగా ఆడుతున్నారు.

error: Content is protected !!