News August 13, 2025
బెల్లంపల్లి: ‘సంస్థ మనది అనుకుని పని చేయాలి’

సంస్థ మనది అనుకొని పనిచేస్తే భావితరాలకు మంచి భవిష్యత్తు ఉంటుందని GM విజయ భాస్కర్ రెడ్డి చెప్పారు. బెల్లంపల్లి CHP, కైరిగూడ OCPలో మల్టీ డిపార్ట్మెంట్ అధికారులు సమావేశం నిర్వహించారు. సింగరేణి సంస్థ సాధించిన ప్రగతి, భవిష్యత్తు కార్యాచరణ, ఉద్యోగులు, యంత్రాల వినియోగంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. సంస్థ అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యాచరణపై ఉద్యోగుల అభిప్రాయాలు తెలుసుకున్నారు.
Similar News
News April 16, 2026
ఖమ్మం: సామాన్య కార్యకర్త స్థాయి నుంచి కీలక నేతగా..

కాంగ్రెస్‌లో సామాన్య కార్యకర్త స్థాయి నుంచి నగర అధ్యక్షుడిగా, టీపీసీసీ సభ్యుడిగా, కార్యవర్గ సభ్యులుగా మహమ్మద్ జావిద్ ఎదిగారు. రాహుల్ గాంధీ జోడోయాత్ర, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఏడేళ్లు ఖమ్మం నగర అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన పార్టీ అభివృద్ధికి విశేష కృషి చేయగా, పార్టీ కార్యాలయంలో గత మంగళవారం టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ జావిద్‌ను సత్కరించారు.
News April 16, 2026
సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాల్లో ‘తేజస్వి’ విజయభేరి

సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాల్లో HNK తేజస్వి పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి విజయభేరి మోగించారు. శ్రీ వైభవి 486, అవ్ని బిజ్జాల 485, విష్ణుప్రియ 480 మార్కులు సాధించారు. మొత్తం 144 మంది విద్యార్థుల్లో 35 మంది 90 శాతానికి పైగా మార్కులు సాధించడం విశేషం. క్రమశిక్షణతో కూడిన బోధన, నిరంతర పరీక్షలే ఈ విజయానికి కారణమని డైరెక్టర్ రేవూరి భగవాన్ రెడ్డి తెలిపారు.
News April 16, 2026
జమ్మికుంట: మార్కెట్‌కు 3 రోజులు సెలవులు

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌కు 3 రోజులు సెలవులు ప్రకటించినట్లు మార్కెట్ ఛైర్ పర్సన్ పుల్లూరి స్వప్న తెలిపారు. శుక్రవారం అమావాస్య సందర్భంగా సెలవు, శని, ఆదివారాల్లో సాధారణ సెలవు ఉంటుందని, తిరిగి 20న సోమవారం మార్కెట్ యథావిధిగా పునః ప్రారంభం అవుతుందని వెల్లడించారు. కావున రైతులు, వ్యాపారస్థులు, కార్మికులు ఈ విషయాన్ని గమనించి సహకరించాల్సిందిగా ఆమె కోరారు.


