News March 9, 2025
భద్రాచలం రాములవారి బ్రహ్మోత్సవాల షెడ్యూల్

భద్రాచలం రాములవారి బ్రహ్మోత్సవాల ఈ నెల 30 నుంచి ప్రారంభంకానున్నాయి. 30న కల్పవృక్ష వాహన సేవ, 31, ఏప్రిల్ 1 తిరువీధి సేవలు, 2 గరుడ పట లేఖనం, 3 భద్రకమండలం లేఖనం, 4 అగ్ని ప్రతిష్ఠ, ద్వజారోహణం, 5 చతుఃస్థానార్చన, ఎదుర్కోలు, 6 కళ్యాణం 7 పట్టాభిషేకం, 8 సదస్యం,హంస వాహన సేవ, 9 తెప్పోత్సవం, చోరోత్సవం, అశ్వ వాహన సేవ, 10 సింహ వాహన సేవ, 11 వసంతోత్సవం, గజవాహన సేవ, 12 చక్రతీర్ధం,పూర్ణాహుతి నిర్వహించనున్నారు.
Similar News
News March 9, 2025
సంగారెడ్డిలో జాబ్ మేళా రేపటికి మార్పు

సంగారెడ్డిలోని తార ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా సోమవారానికి ఛేంజ్ చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ రత్న ప్రసాద్ తెలిపారు. MSN కంపెనీలు ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కోసం ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. బీఎస్సీ, ఎంఎస్సీ పూర్తిచేసి కెమిస్ట్రీ సబ్జెక్టు చదివిన వారు అర్హులని చెప్పారు. ఆసక్తి గలవారు రేపు ఉదయం 10 గంటలకు జాబ్ మేళాకు హాజరు కావాలని కోరారు.
News March 9, 2025
రేపు యధావిధిగా పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమం: ఎస్పీ

ఏలూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం యధావిధిగా పబ్లిక్ గ్రీవెన్స్ పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించబడుతుందని ఏలూరు ఎస్పీ ప్రతాప్ కిషోర్ తెలిపారు. ఎస్పీ కార్యాలయంతో పాటు పోలీస్ స్టేషన్, సర్కిల్ ఆఫీసు, సబ్ డివిజనల్ స్థాయిలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. అర్జీదారులు గమనించి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News March 9, 2025
కాంగ్రెస్ MLC అభ్యర్థులు వీరేనా?

TG: MLA కోటా MLC అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు కొనసాగుతోంది. 4 స్థానాల్లో కాంగ్రెస్‌కు 3, CPIకి 1 దక్కనుంది. INC నుంచి నల్గొండ DCC అధ్యక్షుడు శంకర్ నాయక్ పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. OC లేదా BC కోటాలో జెట్టి కుసుమ కుమార్, కుమార్ రావు, SC కోటాలో అద్దంకి దయాకర్, రాచమళ్ల సిద్దేశ్వర్ పేర్లు వినిపిస్తున్నాయి. దీనిపై చర్చించేందుకు రాష్ట్ర నేతలు కాసేపట్లో మరోసారి భేటీ కానున్నారు.