News March 9, 2025
కాంగ్రెస్ MLC అభ్యర్థులు వీరేనా?

TG: MLA కోటా MLC అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు కొనసాగుతోంది. 4 స్థానాల్లో కాంగ్రెస్‌కు 3, CPIకి 1 దక్కనుంది. INC నుంచి నల్గొండ DCC అధ్యక్షుడు శంకర్ నాయక్ పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. OC లేదా BC కోటాలో జెట్టి కుసుమ కుమార్, కుమార్ రావు, SC కోటాలో అద్దంకి దయాకర్, రాచమళ్ల సిద్దేశ్వర్ పేర్లు వినిపిస్తున్నాయి. దీనిపై చర్చించేందుకు రాష్ట్ర నేతలు కాసేపట్లో మరోసారి భేటీ కానున్నారు.
Similar News
News March 28, 2025
చార్‌ధామ్ యాత్ర.. వీడియోలు, రీల్స్ చిత్రీకరణపై నిషేధం

ఈ ఏడాది చార్‌ధామ్ యాత్ర సందర్భంగా ఆలయాల ప్రాంగణంలో యూట్యూబర్లు, సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లపై నిషేధం ఉండనుంది. ఆలయ ప్రాంగణంలో వీడియోలు, రీల్స్ చేస్తూ ఎవరైనా దొరికితే వారికి దర్శనం నిరాకరించి తిరిగి పంపించేస్తామని కేదార్‌నాథ్-బద్రీనాథ్ పాండా సమాజ్ ప్రకటించింది. ఏప్రిల్ 30న గంగోత్రి, యమునోత్రి తలుపులు, మే 2న కేదార్‌నాథ్, 4న బద్రీనాథ్ ఆలయ తలుపులు తెరుచుకోనున్నాయి.
News March 28, 2025
అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు పెద్దవాడు: అంబటి

AP: అబద్ధాలు చెప్పడంలో CM చంద్రబాబు అందరికంటే పెద్దవారని, నిజాలు చెప్పడంలో చిన్న వారని YCP నేత అంబటి రాంబాబు విమర్శించారు. ‘పోలవరం ప్రాజెక్టును సర్వనాశనం చేసింది చంద్రబాబే. ప్రాజెక్టు నిధులను జగన్ రాష్ట్ర ప్రభుత్వానికి మళ్లించారని ఆయన ఆరోపిస్తున్నారు. ఇది నిజమని నిరూపిస్తే సాష్టాంగ నమస్కారం చేస్తా. కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్టును మేమే కడతామని CBN ఎందుకు ఒప్పందం చేసుకున్నారు?’ అని ప్రశ్నించారు.
News March 28, 2025
మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు!

TG: ఇవాళ్టి నుంచి మరో 5 రోజులపాటు రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాబోయే 3 రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరగొచ్చని అంచనా వేసింది. పలు జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41-44 డిగ్రీల మధ్య, మరికొన్ని జిల్లాల్లో 36-40 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపింది.