News March 18, 2026

‘భూ భారతి’లో 4వేల దరఖాస్తులు రామచంద్రాపురానివే..!

image

రేవంత్ రెడ్డి సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘భూ భారతి’పోర్టల్‌కు జిల్లాలో వచ్చిన మొత్తం దరఖాస్తుల్లో 4వేల అప్లికేషన్లు రామచంద్రాపురానివే. మంత్రి సీతక్క చొరవతో కలెక్టర్ దివాకర 10,500 ఎకరాలకు శాశ్వతంగా హద్దులు నిర్ణయించి పట్టాలు ఇచ్చేందుకు రీ సర్వేకు పూనుకున్నారు. గతంలో 1974-75, 1982, 1992, 2008లో కూడా సర్వేలు జరిగినా సత్ఫలితం రాలేదు. ఇప్పుడైనా పరిష్కారం వస్తుందని రైతులు భావిస్తున్నారు.

Similar News

News April 14, 2026

GNT: అమరావతి శాటిలైట్ మ్యాప్‌ల విడుదల

image

ప్రపంచ బ్యాంకు అమరావతి శాటిలైట్ మ్యాప్‌లను విడుదల చేసింది. ఇందులో 2024, 2026 సంవత్సరాల మధ్య వచ్చిన మార్పులను స్పష్టంగా చూపించింది. రాజధాని ఫేజ్-1 పనులకు రూ. 30 వేల కోట్లకు పైగా నిధులు అందుబాటులోకి వచ్చాయి. దీనికి గ్లోబల్ ఫండింగ్ సంస్థల నుంచి కూడా భారీ మద్దతు లభిస్తోంది. నిధుల రాకతో అమరావతి నిర్మాణం కేవలం ప్రణాళికలకే పరిమితం కాకుండా ఆచరణ దశకు చేరుకుంది. క్షేత్రస్థాయిలో పనులు వేగవంతం అయ్యాయి.

News April 14, 2026

GNT: జపాన్ రాయబారితో నారా లోకేశ్ భేటీ

image

​ఢిల్లీ పర్యటనలో జపాన్ రాయబారి ఒనో కెయిచితో మంత్రి నారా లోకేశ్ సమావేశమయ్యారు. ఏపీ, జపాన్ మధ్య ఉన్న అనుబంధంపై వీరు చర్చించారు. శ్రీసిటీలో ఇప్పటికే పలు జపాన్ కంపెనీలు ఉన్నాయని లోకేశ్ గుర్తుచేశారు. రాష్ట్రానికి మరిన్ని జపాన్ పెట్టుబడులను ఆకర్షించే మార్గాలపై ప్రధానంగా చర్చలు జరిపినట్లు ఆయన ‘X’ వేదికగా వెల్లడించారు.

News April 14, 2026

GNT: అమరావతిలో అగ్ని ప్రమాదాలకు చెక్!

image

అమరావతిలో వరుస అగ్ని ప్రమాదాల నేపథ్యంలో ADCL దృష్టి సారించింది. ADCL 320కి.మీ. పరిధిలో జరుగుతున్న ట్రంక్ రోడ్లు,12 LPS జోన్ల పరిధిలోని కాంట్రాక్టర్లకు మార్గదర్శకాలు జారీచేసింది. నిర్మాణ సంస్థలు వారి క్యాంపు ప్రదేశాల్లో పటిష్ఠమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఛైర్‌పర్సన్ లక్ష్మీపార్థసారథి స్పష్టం చేశారు. అధికారులు అగ్ని ప్రమాదాల నివారణపై నిరంతరాయంగా క్యాంపులను సందర్శించి చర్యలు తీసుకోవాలన్నారు.