News August 12, 2025
మంచిర్యాల: జిల్లావ్యాప్తంగా 14.4మి.మీ వర్షపాతం

మంచిర్యాల జిల్లావ్యాప్తంగా సోమవారం 14.4 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా భీమినిలో 57.4 మి.మీ, అత్యల్పంగా దండేపల్లి, భీమారంలో సున్నా వర్షపాతం నమోదైంది. తాండూరులో 36.2, బెల్లంపల్లి 30.0, మంచిర్యాల 28.6, జైపూర్‌లో 23.4, మందమర్రిలో 21.4, కాసిపేటలో 17.6, జన్నారం 1.2, లక్షెట్టిపేట 11.0, హాజీపూర్ 1.4, కన్నెపల్లి 9.6, వేమనపల్లి 2.0, నెన్నెల 3.2 మి.మీగా రికార్డయింది.
Similar News
News April 17, 2026
గుజరాత్‌తో పోరు.. కోల్‘కథ’ మారేనా?

IPLలో భాగంగా ఇవాళ గుజరాత్ టైటాన్స్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడనుంది. ఇప్పటిదాకా ఆడిన 4 మ్యాచు(వర్షం వల్ల ఒకటి రద్దు)ల్లోనూ KKR ఘోరంగా ఓడిపోయింది. ఈ నేపథ్యంలో నేటి పోరులో ఎలాగైనా విజయం సాధించాలని భావిస్తోంది. మరోవైపు GT తొలి 2 మ్యాచుల్లో ఓడినా తర్వాత పుంజుకుని 2 గెలిచింది. కెప్టెన్ గిల్, బట్లర్, రషీద్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ ఫామ్‌లో ఉండటంతో ఇదే జోరు కొనసాగించాలని అనుకుంటోంది.
News April 17, 2026
రెండేళ్లలో 5 వేల ఆలయాల నిర్మాణం: CBN

AP: శ్రీవాణి ట్రస్ట్ నిధులతో రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 5 వేల ఆలయాల నిర్మాణం పూర్తి చేయాలని CM చంద్రబాబు ఆదేశించారు. ఒక్కో నియోజకవర్గంలో 25-30 గుళ్లు నిర్మించే అవకాశం ఉందన్నారు. ‘సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, శ్రీకాళహస్తి, కాణిపాకం దేవాలయాలకు మాస్టర్ ప్లాన్లు సిద్ధంగా ఉన్నాయి. మిగతా ఆలయాలకూ రూపొందించాలి. వీటి ద్వారా భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలి’ అని దేవదాయ శాఖ సమీక్షలో సూచించారు.
News April 17, 2026
45 డిగ్రీలు.. వచ్చే 2 నెలలు ఎండలు తీవ్రం

దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు 40-45 డిగ్రీలు నమోదవుతున్నాయి. రాబోయే రోజుల్లో 45 డిగ్రీలు దాటుతాయని, మే, జూన్‌లో ఎండలు మరింత తీవ్రమవుతాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఏడాది వేసవి సుదీర్ఘంగా ఉంటుందని చెబుతున్నారు. వాతావరణ మార్పులతో వర్షాలు కురిస్తే తప్ప హీట్ నుంచి ఉపశమనం లభించదని పేర్కొంటున్నారు. నిన్న APలోని 215 మండలాల్లో 40 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


