News January 25, 2026

మంచిర్యాల: 8 మంది మావోయిస్టుల లొంగుబాటు

image

మావోయిస్టులు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని సీపీ అంబర్ కిషోర్ ఝా పిలుపునిచ్చారు. శనివారం సీపీ కార్యాలయంలో మలీషియా, కొరియర్, సాంస్కృతిక విభాగాలకు చెందిన ఎనిమిది మంది మావోయిస్టులు ఎదుట లొంగిపోయారు. సీపీ మాట్లాడుతూ.. లొంగిపోయిన వారికి ప్రభుత్వం అందించే పునరావాస పథకాలను వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు.

Similar News

News February 14, 2026

విశాఖ: అరుదైన రక్తం 57వసారి దానం

image

విశాఖ స్టీల్ ప్లాంట్ డీజీఎం(సేఫ్టీ) కర్రి శ్రీనివాస్ అరుదైన O-నెగటివ్ రక్తాన్ని 57వసారి దానం చేసి సేవా స్ఫూర్తిని చాటారు. గుండెపోటుతో కేజీహెచ్‌లో శస్త్రచికిత్సకు సిద్ధమైన హిరమండలం ప్రాంతానికి చెందిన రామారావుకు అత్యవసరంగా రక్తం అవసరమవడంతో ఆయన స్పందించారు. అవసరమైన వారికి రక్తం దానం చేయడం సంతృప్తిని ఇస్తోందని ఆయన అన్నారు.

News February 14, 2026

NZB: కింగ్ మేకర్‌గా BRS కార్పోరేటర్ విజయలక్ష్మీ

image

నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో రాజకీయ సమీకరణాలు వేడెక్కాయి. ఈ నేపథ్యంలో 37వ డివిజన్ నుంచి BRS అభ్యర్థిగా గెలిచిన ప్యాట విజయలక్ష్మి కింగ్ మేకర్‌గా మారనున్నారు. కార్పొరేషన్‌లో అధికారం సాధించేందుకు ఆమె మద్దతు కీలకంగా మారడంతో కాంగ్రెస్, బీజేపీ నేతలు తమవైపు తిప్పు కొనేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కాంగ్రెస్ ఆమెను వారి క్యాంప్‌నకు తరలించారని సమాచారం.

News February 14, 2026

NTR: మృత్యువుకు బ్రేక్ వేసిన పోలీసులు.. ముగ్గురు సేఫ్

image

కుటుంబ కలహాలతో పిల్లలతో కలిసి ఆత్మహత్యకు యత్నించిన మహిళను పోలీసులు కాపాడారు. చిలకలపూడికి చెందిన ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో ప్రకాశం బ్యారేజీపై నుంచి దూకబోతుండగా ట్రాఫిక్ RSI శ్రీధర్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ భూషణం సకాలంలో స్పందించి వారిని అడ్డుకున్నారు. ప్రాణాపాయం నుంచి తప్పించి, తదుపరి చర్యల నిమిత్తం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసుల సమయస్ఫూర్తిపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.