News October 9, 2024

మదనపల్లె జిల్లా ఇప్పుడే కాదు: చంద్రబాబు

image

కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 30 జిల్లాలుగా మారుస్తామనే ప్రచారంలో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. మదనపల్లె, మార్కాపురం జిల్లాపై తాము హామీలు ఇచ్చామన్నారు. ఆయా జిల్లాలు కూడా ఇప్పుడే ఏర్పాటు చేయబోమని తెలిపారు. ఎన్నికలకు ముందే పుంగనూరు, మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరుతో కలిపి మదనపల్లె జిల్లా ఏర్పాటు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

Similar News

News April 14, 2026

అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దాం: చిత్తూరు కలెక్టర్

image

అంబేడ్కర్ ఆశయ సాధనకు అందరం కృషి చేద్దామని కలెక్టర్ సుమిత్ కుమార్ పిలుపునిచ్చారు. చిత్తూరు దర్గా సర్కిల్‌లో నిర్వహించిన జయంతిలో ఆయన పాల్గొన్నారు. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఆయన చూపిన బాటలో నడిస్తే దేశాభివృద్ధి సాధ్యమన్నారు.

News April 14, 2026

చిత్తూరు: ఈ ప్రాంతాలలో కోళ్ల రవాణా నిషేధం

image

సదుం మండలంలోని పుట్టవారి పల్లి, అమ్మగారిపల్లి, కంభంవారి పల్లి, కార్వేటి నగరం మండలంలోని RKVB పేట నుంచి కోళ్ల రవాణా నిషేధిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఫిబ్రవరిలో ఈ ప్రాంతాలలో కోళ్లకు బర్డ్ ప్లూ సోకిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు నెలలపాటు ఈ ప్రాంతాలలో నమూనాలు తీసి టెస్టింగ్‌కు పంపనున్నారు. అన్నింటిలో నెగటివ్ వస్తేనే కోళ్ల పెంపకానికి అనుమతించనున్నారు.

News April 14, 2026

చిత్తూరు: పుంజుకుంటున్న టమాటా ధరలు

image

సరైన గిట్టుబాటు ధర లేక నష్టపోతున్న టమాట రైతులకు ప్రస్తుతం పెరుగుతున్న ధరలు ఆశలు రేకెత్తిస్తున్నాయి. పలమనేరులో సోమవారం టమాటా బాక్సు (14 కిలోలు) ధర రూ.400 పలికింది. నాలుగు రోజుల కిందట బాక్సు రూ.200 ఉండగా రోజుకి యాభై చొప్పున ధర పెరుగుతూ వస్తోంది. వేసవి ప్రభావంతో పంట దిగుబడులు తగ్గడంతో ధర పెరుగుతోంది. మరింత ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వస్తున్నాయి.