News April 13, 2026
మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్‌కు శాశ్వత భవనం

మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (MMC) శాశ్వత కార్యాలయ భవన నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం రూ.98 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉప్పల్ భగాయత్ లేఅవుట్ ఫేజ్-3లోని సర్వే నంబర్లు 264 నుంచి 280 మధ్య గల 10 ఎకరాల స్థలంలో ఈ భవనాన్ని నిర్మించనున్నారు. మల్కాజిగిరి, ఉప్పల్, ఎల్బీనగర్ జోన్లతో కూడిన ఈ కార్పొరేషన్ కార్యకలాపాలు త్వరలోనే సొంత భవనం నుంచి సాగనున్నాయి.
Similar News
News April 20, 2026
కొడంగల్: CM ఇలాకాలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో రూ.224 కోట్లతో 450 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తున్నారు. కాగా, రాష్ట్రంలోని పెద్ద సర్కార్ దవాఖానాలైన గాంధీ (2,000+ పడకలు), ఉస్మానియా (1,168+ పడకలు) తర్వాత, ప్రాంతీయ స్థాయిలో ఇంతటి ఆధునిక వైద్యశాల రావడం ఇదే తొలిసారి. ఈ భారీ నిర్మాణం పూర్తయితే కొడంగల్‌తో పాటు పరిసర జిల్లాలకు ఎంతో ఉపయోగపడనుంది.

HYDలో త్వరలో మరో IVF సెంటర్

HYD హైకోర్టు సమీపంలోని పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రిలో త్వరలో IVF కేంద్రం అందుబాటులోకి రానుంది. గాంధీ ఆసుపత్రిలో IVF సెంటర్ సక్సెస్ అయిన నేపథ్యంలో ఇక్కడా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు DME నరేందర్ కుమార్ తెలిపారు. సుమారుగా 490 పడకల సామర్థ్యంతో, డాక్టర్లతో అద్భుతమైన సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రెగ్నెన్సీ పరీక్షలు చేయడం, పసిపిల్లలకు వైద్యం, పిల్లల తల్లులకు అడ్వాన్స్‌డ్ వైద్యం అందించనున్నారు.