News January 21, 2026

మహబూబ్‌నగర్: ‘నియమాలు పాటిస్తేనే ప్రయాణం సురక్షితం’

image

ప్రతి వాహనదారుడు రోడ్డు నిబంధనలు పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చని కలెక్టర్ విజయేందిర బోయి పేర్కొన్నారు. బుధవారం ఆర్టీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవ ముగింపు వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కుటుంబ సభ్యులు వేచి చూస్తుంటారన్న విషయాన్ని గుర్తించి జాగ్రత్తగా వాహనాలు నడపాలని సూచించారు. నిర్లక్ష్యం వీడి ప్రాణాలను కాపాడుకోవాలని కోరారు.

Similar News

News February 7, 2026

పాలమూరులో 13.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత

image

మహబూబ్‌నగర్ జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో బాలానగర్ మండలం ఉడిత్యాల, మిడ్జిల్ మండలం దోనూరు గ్రామాల్లో అత్యంత కనిష్ఠంగా 13.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాజాపూర్‌లో 14.2, జడ్చర్లలో 14.6 డిగ్రీలుగా ఉంది. రాత్రి వేళల్లో చలి గాలులు తీవ్రమవడంతో ప్రజలు బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. రానున్న రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

News February 7, 2026

ఎన్నికల్లో పీవో, ఏపీవోల పాత్ర కీలకం: కలెక్టర్ విజయేంద్ర

image

ఈనెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికలను పటిష్టంగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ విజయేంద్ర బోయి ఆదేశించారు. ఎన్నికల్లో పీవో, ఏపీవోల పాత్ర కీలకమని అన్నారు. పాలమూరు కార్పొరేషన్, దేవరకద్ర, భూత్పూర్ ఎన్నికల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలకు 36 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించినట్లు తెలిపారు. విధి నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా పారదర్శకత పాటించాలని స్పష్టం చేశారు.

News February 6, 2026

పాలమూరు జిల్లాలో ఈనాటి ముఖ్య వార్తలు

image

✒ పరీక్షల షెడ్యూల్ విడుదల
✒ డిగ్రీ రీవాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదల
✒ పుట్ట గొడుగు తయారీలో ఉచిత శిక్షణ
✒ పాలమూరుకు సీఎం వలస వచ్చారు: డీకే అరుణ
✒ ఫైనల్‌కు చేరిన పాలమూరు జట్టు
✒ పాలమూరు మున్సిపల్‌లో త్రిముఖ పోరు
✒ ఎన్నికల తర్వాత జిల్లాను రద్దు చేస్తారు: రాజేందర్ రెడ్డి
✒ పాలమూరు: బాలికపై అత్యాచారం.. యువకుడి అరెస్ట్