News July 18, 2024

మిస్సైన వ్యక్తి పవన్ కళ్యాణ్‌కు రాసిన లేఖ వైరల్

image

ప.గో జిల్లా నర్సాపురం ఎంపీడీవో వెంకటరమణ అదృశ్యంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. వెంటనే ఆయన ఆచూకీ కనుక్కోవాలని అధికారులను ఆదేశించారు. ఆయన అదృశ్యానికి కారణమైన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ఒక ఫోన్లో డిప్యూటీ సీఎంకు రాసిన లేఖను పంపారు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Similar News

News February 18, 2026

శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యం: ఎస్పీ

image

తూ.గో. జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా పోలీస్ యంత్రాంగం పనిచేస్తోందని ఎస్పీ డి.నరసింహ కిషోర్ స్పష్టం చేశారు. మండపేట నియోజకవర్గం జిల్లాలో విలీనమైన తర్వాత బుధవారం ఆయన తొలిసారిగా ఇప్పనపాడు, మండపేట టౌన్, రూరల్ పోలీస్ స్టేషన్లను సందర్శించారు. జిల్లాలో చోరీల నివారణకు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలకు చేరువయ్యేలా ‘స్నేహపూరిత పోలీసింగ్’ వ్యవస్థను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.

News February 18, 2026

రాజమండ్రి: A2గా MLC అనంత బాబు భార్య.. కోర్టులో ఛార్జిషీట్!

image

ఎమ్మెల్సీ అనంత బాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో పోలీసులు కీలక అడుగు వేశారు. ఈ కేసులో ఎమ్మెల్సీ అనంత బాబు భార్యను రెండో నిందితురాలిగా (A2) పేర్కొంటూ రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్టులో తాజాగా ఛార్జిషీట్ దాఖలు చేశారు. సుబ్రహ్మణ్యం హత్య ఘటన గతంలో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజా అఛార్జిషీట్‌తో ఈ కేసు విచారణలో మరో కీలక మలుపు చోటుచేసుకుంది.

News February 18, 2026

రాజమండ్రి కోర్టుకి బాంబు బెదిరింపు

image

తెలుగు రాష్ట్రాల్లోని పలు కోర్టులకు బుధవారం బాంబు బెదిరింపులు వచ్చాయి. రాజమండ్రి, కరీంనగర్, అనంతపురం కోర్టులకు ఈ కాల్స్ రావడంతో పోలీసులు బాంబ్, డాగ్ స్క్వాడ్ బృందాలతో తనిఖీలు చేపట్టారు. రాజమండ్రి కోర్టులో న్యాయవాదులు, కక్షిదారులను బయటకు పంపించి ముమ్మరంగా గాలించారు. ఎక్కడా బాంబు ఆచూకీ లభించకపోవడంతో ఇది ఆకతాయిల పనిగా పోలీసులు భావిస్తున్నారు.