News February 18, 2026

రాజమండ్రి: A2గా MLC అనంత బాబు భార్య.. కోర్టులో ఛార్జిషీట్!

image

ఎమ్మెల్సీ అనంత బాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో పోలీసులు కీలక అడుగు వేశారు. ఈ కేసులో ఎమ్మెల్సీ అనంత బాబు భార్యను రెండో నిందితురాలిగా (A2) పేర్కొంటూ రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్టులో తాజాగా ఛార్జిషీట్ దాఖలు చేశారు. సుబ్రహ్మణ్యం హత్య ఘటన గతంలో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజా అఛార్జిషీట్‌తో ఈ కేసు విచారణలో మరో కీలక మలుపు చోటుచేసుకుంది.

Similar News

News April 20, 2026

కాయకవే కైలాస.. బసవన్న మార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శం!

image

బొమ్మూరు కలెక్టరేట్‌లో సోమవారం సంఘ సంస్కర్త బసవన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ కీర్తి చేకూరి బసవన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. “కాయకవే కైలాస” అనే ఆయన బోధన ప్రతి ఒక్కరికీ మార్గదర్శకమని పేర్కొన్నారు. పని పట్ల నిబద్ధత, నిజాయితీతో కర్తవ్యాన్ని నిర్వహించడం ద్వారా సమాజానికి మేలు చేయవచ్చని ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

News April 20, 2026

దళారుల ఉచ్చులో పడకండి: DTO

image

తూ.గో (D) రవాణాశాఖ సేవలు పూర్తిగా ఆన్‌లైన్‌లోనే అందుబాటులో ఉన్నట్లు DTO ఆర్. సురేశ్ సోమవారం తెలిపారు. లైసెన్స్ కోసం దళారులను ఆశ్రయించి మోసపోవద్దని వినియోగదారులకు సూచించారు. సమాచారం కోసం నేరుగా కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు. ఎవరైనా లంచం అడిగితే తక్షణమే తమకు ఫిర్యాదు చేయాలని స్పష్టం చేశారు. పారదర్శక సేవలను వినియోగించుకోవాలని ఆయన కోరారు.