News January 16, 2026

మెట్రోను స్వాధీనం చేసుకోండి.. రేవంత్‌కు కిషన్ రెడ్డి లేఖ

image

TG: HYD మెట్రో నెట్‌వర్క్‌‌ను L&T నుంచి <<17829072>>స్వాధీనం<<>> చేసుకోవాలని సీఎం రేవంత్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. ఆ తర్వాతే రెండో దశ నిర్మాణానికి కావాల్సిన ప్రతిపాదనలు కేంద్రానికి పంపాలని సూచించారు. ‘రెండో దశ సన్నాహాల కోసం సంయుక్త కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం అధికారుల పేర్లను ప్రతిపాదించలేదు. వెంటనే పేర్లు పంపి సమావేశ నిర్వహణకు ప్రయత్నించండి’ అని పేర్కొన్నారు.

Similar News

News March 3, 2026

ఏ పంటల్లో ఎలాంటి ఎర పంటలను వేస్తే మంచిది?

image

☛ పత్తి, వేరుశనగ చుట్టూ ఆముదపు పంటను ఎర పంటగా వేసి పొగాకు లద్దె పురుగుల్ని, బంతి మొక్కలు వేసి శనగ పచ్చపురుగులను నివారించవచ్చు. ☛ క్యాబేజీలో ఆవాల పంటను వేసి డైమండ్ బ్యాక్ మాత్‌ను నివారించవచ్చు. ☛ వేరుశనగలో అలసందలు వేసి ఎర్రగొంగళి పురుగుల ఉద్ధృతి తగ్గించవచ్చు. ☛ అలసందలు పంటలో ఆవాలును ఎర పంటగా వేసి గొంగళిపురుగు, పొద్దుతిరుగుడు మొక్కలను నాటి కాయతొలుచు పురుగులను నివారించవచ్చు.

News March 3, 2026

హోలీ ఆఫర్ల పేరుతో లింక్స్.. క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ!

image

TG: హోలీ పండగను క్యాష్ చేసుకునేందుకు సైబర్ కేటుగాళ్లు రెడీ అయ్యారు. రంగులు, గిఫ్ట్స్, ఈవెంట్ పాస్‌ల మీద భారీ డిస్కౌంట్లు ఉన్నాయంటూ వాట్సాప్, SMSలలో ఫేక్ లింకులు పంపుతున్నారు. వీటిపై క్లిక్ చేస్తే మీ ఫోన్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్ హెచ్చరించారు. పొరపాటున మోసపోతే వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయాలని ఆమె సూచించారు.

News March 3, 2026

రాష్ట్రంలో మళ్లీ వర్షాలు!

image

AP: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఆవరించిన ఉపరితల ఆవర్తనం 4 రోజుల్లో ఉపరితల ద్రోణిగా విస్తరించే ఆస్కారముందని వాతావరణశాఖ తెలిపింది. దీంతో ఈ నెల 7వ తేదీ తర్వాత కోస్తాంధ్రలో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. రానున్న 24 గంటల్లో రాష్ట్రంలోని చాలాచోట్ల ఎండ తీవ్రత ఉంటుందని హెచ్చరించింది. అయినా అల్లూరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో పొగమంచు కురుస్తుందని చెప్పింది. ఇక నిన్న దేశంలోనే కర్నూలులో అత్యధికంగా 38°C నమోదైంది.