News January 12, 2026
మెదక్: ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి: అదనపు కలెక్టర్

కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సమస్యల పరిష్కారానికి సమర్థంగా ఉపయోగించుకోవాలని అదనపు కలెక్టర్ నగేశ్ తెలిపారు. సమావేశ మందిరంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మొత్తం 44 అర్జీలను స్వీకరించారు. ఇందులో భూభారతి-32, పెన్షన్-2, ఇందిరమ్మ ఇళ్లు-2, ఇతర సమస్యలపై- 9 దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు. వచ్చిన అర్జీలను వెంటనే పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
Similar News
News April 19, 2026
మెదక్: బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ముగ్గురు కౌన్సిలర్లు

మెదక్ మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ముగ్గురు కౌన్సిలర్లు సంద్య నవీన్(13వ వార్డు), గౌస్ ఖురేషి(22వ వార్డు), శృతి సంతోష్(23వ వార్డు) కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్ రావు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఎమ్మెల్యే రోహిత్ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు వారు తెలిపారు.
News April 19, 2026
మెదక్ ఏఎస్పీగా విక్రాంత్ కుమార్ సింగ్

మెదక్ జిల్లా అదనపు ఎస్పీ(అడ్మిన్)గా 2022 బ్యాచ్‌కు చెందిన విక్రాంత్ కుమార్ సింగ్ ఐపీఎస్ నియమితులయ్యారు. ప్రస్తుతం భద్రాచలంలో ఏఎస్పీగా విధులు నిర్వహిస్తున్న ఆయనను మెదక్‌కు బదిలీ చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ పనిచేసిన మహేందర్ గత నెల 31న రిటైర్ కావడంతో ఆ స్థానంలో విక్రాంత్ బాధ్యతలు చేపట్టనున్నారు.
News April 19, 2026
మెదక్: ఇంటికి చేరాలి.. షార్ట్ ఫిల్మ్‌ను ప్రారంభించిన ఎస్పీ

మెదక్ జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో రహదారి భద్రతపై అవగాహన కోసం రూపొందించిన “ఇంటికి చేరాలి…” అనే షార్ట్ ఫిల్మ్‌ను ఎస్పీ శ్రీనివాసరావు ప్రారంభించారు. 99 రోజుల ప్రజా ప్రణాళిక “సురక్షిత ప్రయాణం” కార్యక్రమంలో భాగంగా రూపొందిన ఈ చిత్రం యువతలో మార్పు తీసుకురావడమే లక్ష్యంమని, హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని, జరిమానాలు, శిక్ష కోసం కాకుండా ప్రాణ రక్షణ కోసం అనే సందేశాన్ని అందిస్తోందని తెలిపారు.


