News December 4, 2025
రాజమండ్రి: నిర్మలా సీతారామన్‌కు MP పురంధేశ్వరి రిక్వెస్ట్!

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌తో రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి బుధవారం భేటీ అయ్యారు. పొగాకు బోర్డులో మానవ వనరుల పునర్వ్యవస్థీకరణ, పొగాకుపై GST, పంటకు సంబంధించిన పలు విషయాలను ఆమె వివరించారు. టొబాకో బోర్డు ఛైర్మన్ చిడిపోతు యశ్వంత్ కూడా పలు సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆమె సానుకూలంగా స్పందించి త్వరలోనే పరిష్కారానికి హామీ ఇచ్చారని పురంధేశ్వరి పేర్కొన్నారు.
Similar News
News February 18, 2026
రాజమండ్రి: A2గా MLC అనంత బాబు భార్య.. కోర్టులో ఛార్జిషీట్!

ఎమ్మెల్సీ అనంత బాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో పోలీసులు కీలక అడుగు వేశారు. ఈ కేసులో ఎమ్మెల్సీ అనంత బాబు భార్యను రెండో నిందితురాలిగా (A2) పేర్కొంటూ రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్టులో తాజాగా ఛార్జిషీట్ దాఖలు చేశారు. సుబ్రహ్మణ్యం హత్య ఘటన గతంలో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజా అఛార్జిషీట్‌తో ఈ కేసు విచారణలో మరో కీలక మలుపు చోటుచేసుకుంది.
News February 18, 2026
రాజమండ్రి కోర్టుకి బాంబు బెదిరింపు

తెలుగు రాష్ట్రాల్లోని పలు కోర్టులకు బుధవారం బాంబు బెదిరింపులు వచ్చాయి. రాజమండ్రి, కరీంనగర్, అనంతపురం కోర్టులకు ఈ కాల్స్ రావడంతో పోలీసులు బాంబ్, డాగ్ స్క్వాడ్ బృందాలతో తనిఖీలు చేపట్టారు. రాజమండ్రి కోర్టులో న్యాయవాదులు, కక్షిదారులను బయటకు పంపించి ముమ్మరంగా గాలించారు. ఎక్కడా బాంబు ఆచూకీ లభించకపోవడంతో ఇది ఆకతాయిల పనిగా పోలీసులు భావిస్తున్నారు.
News February 18, 2026
వయోవృద్ధులకు ప్రత్యేక కార్యక్రమాలు: కలెక్టర్

తూర్పుగోదావరి జిల్లా వయోవృద్ధుల కోసం నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, మెడికల్ క్యాంపు నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం తెలిపారు. ఫిబ్రవరి 21న ధవళేశ్వరంలోని శ్రీ గేదెల నూక రాజు కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. వృద్ధులు ఉత్పాదక జీవనం గడిపేలా వర్క్‌షాపులు నిర్వహిస్తామని, జిల్లాలోని వయోవృద్ధులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.


