News February 28, 2025
రాష్ట్రస్థాయికి ఎంపికైన కామారెడ్డి టీచర్

బిక్కనూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భౌతిక శాస్త్రం బోధిస్తున్న తమ్మల రాజు అనే ఉపాధ్యాయుడు రాష్ట్రస్థాయి సైన్స్ సెమినార్‌కు ఎంపికైనట్లు మండల విద్యా వనరుల అధికారి రాజా గంగారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. తమ్మల రాజు విజ్ఞాన శాస్త్రంలో విద్యార్థుల ప్రమాణాలు పెంచడానికి వినూత్న పద్ధతులతో బోధన చేపట్టారు. సెమినార్‌కు ఎంపిక కావడంతో ఉపాధ్యాయులు అభినందించారు.
Similar News
News March 1, 2025
ఆహారం నాణ్యతపై తనిఖీలు నిర్వహించాలి: కలెక్టర్

అనకాపల్లి జిల్లాలో ఉన్న వసతిగృహాలలో మంచినీరు, ఆహారం నాణ్యతపై అధికారులు తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్ విజయ్ కృష్ణన్ సూచించారు. శుక్రవారం వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎమ్.ఎస్.ఎమ్.ఇ. సర్వే మార్చి 15నాటికి పూర్తిచేయాలని ఆదేశించారు. జిల్లాలో అతిసార, మలేరియా, డెంగ్యూ, కలరా వంటి వ్యాధులు ప్రబలకుండా స్పష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
News March 1, 2025
విశాఖలో TODAY TOP NEWS

➤ KGHలో నకిలీ డాక్టర్.. రూ.లక్షతో పరార్..!
➤ ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రిన్సిపల్‌గా సంధ్యాదేవి
➤ సింహాద్రి, జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లు రద్దు
➤ బాధ్యతలు స్వీకరించనున్న AU వీసీ జి.పి రాజుశేఖర్
➤ ప్రత్యేక అలంకరణలో చంద్రంపాలెం దుర్గాలమ్మ
➤ ఆటోనగర్, ఐటీ హిల్స్ ప్రాంతాలకు ప్రత్యేక RTC సర్వీసులు నడపాలి: కలెక్టర్
➤ విశాఖలో చిట్టీల పేరుతో ఘరానా మోసం
➤ జిల్లాలో రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు రాయనున్న 83,001 మంది
News March 1, 2025
మిరాకిల్ జరిగితేనే..

వర్షం కారణంగా ఆస్ట్రేలియాతో మ్యాచ్ రద్దవ్వడంతో అఫ్గానిస్థాన్ సెమీస్ ఆశలు దాదాపు గల్లంతైనట్లే. పాయింట్ల పరంగా దక్షిణాఫ్రికా(3P)తో సమానంగా ఉండగా రేపటి మ్యాచులో ఇంగ్లండ్ చేతిలో SA భారీ తేడాతో ఓడితేనే అఫ్గాన్‌కు అవకాశాలు ఉంటాయి. సుమారు 200 పరుగుల తేడాతో ENG గెలవాల్సి ఉంది. ఒకవేళ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైనా SA నేరుగా సెమీస్ వెళ్లనుంది.