News March 1, 2025

మిరాకిల్ జరిగితేనే..

image

వర్షం కారణంగా ఆస్ట్రేలియాతో మ్యాచ్ రద్దవ్వడంతో అఫ్గానిస్థాన్ సెమీస్ ఆశలు దాదాపు గల్లంతైనట్లే. పాయింట్ల పరంగా దక్షిణాఫ్రికా(3P)తో సమానంగా ఉండగా రేపటి మ్యాచులో ఇంగ్లండ్ చేతిలో SA భారీ తేడాతో ఓడితేనే అఫ్గాన్‌కు అవకాశాలు ఉంటాయి. సుమారు 200 పరుగుల తేడాతో ENG గెలవాల్సి ఉంది. ఒకవేళ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైనా SA నేరుగా సెమీస్ వెళ్లనుంది.

Similar News

News March 25, 2025

నేనెప్పుడు కేసీఆర్‌ను కించపరచలేదు: జూపల్లి

image

TG: తానెప్పుడూ బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌ను కించపరచలేదని, భవిష్యత్తులోనూ కించపరచబోనని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయనంటే ఉద్యమం నుంచి గౌరవం ఉందని చెప్పారు. అయితే సోనియాగాంధీ ఇవ్వడం వల్లే తెలంగాణ వచ్చిందన్నారు. రానున్న ఐదేళ్లలో పర్యాటక రంగంలో రూ.15వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యమని చెప్పారు. మూడు లక్షల అదనపు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు.

News March 25, 2025

7.81L సిమ్ కార్డులు, 83K వాట్సాప్ ఖాతాలు బ్లాక్: బండి

image

ప్రజలను తప్పుదోవ పట్టించడం, డిజిటల్ అరెస్టుల పేరిట మోసాలు చేస్తున్న వారిని కట్టడి చేస్తున్నట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. ఈ ఏడాది FEB వరకు 7.81L సిమ్ కార్డులు, 83K వాట్సాప్ ఖాతాలను, 2.08L IMEIలను బ్లాక్ చేసినట్లు చెప్పారు. ఇప్పటి వరకు రూ.4,386 కోట్లను కాపాడినట్లు పార్లమెంటులో సమాధానమిచ్చారు. సైబర్ నేరాలపై ఫిర్యాదు చేసేందుకు https://cybercrime.gov.in పోర్టల్‌ను ప్రారంభించామన్నారు.

News March 25, 2025

రేపు వైసీపీ ఇఫ్తార్ విందు

image

AP: రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు రేపు సాయంత్రం ఇఫ్తార్ విందు ఇవ్వనున్నట్లు వైసీపీ వెల్లడించింది. విజయవాడ ఎన్ఏసీ కళ్యాణ మండపంలో కార్యక్రమం జరుగుతుందని తెలిపింది. మాజీ సీఎం వైఎస్ జగన్‌తోపాటు ముస్లిం మత పెద్దలు, పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరవుతారని పేర్కొంది.

error: Content is protected !!