News September 12, 2025

రేపు, ఎల్లుండి జిల్లాకు భారీ వర్ష సూచన

image

రానున్న ఐదు రోజులు భద్రాద్రి జిల్లాలో వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. 13, 14వ తేదీల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. 17వ తేదీ వరకు తేలికపాటి వర్షాలు పడతాయని చెప్పారు. ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షపు నీరు నిలువ లేకుండా చూసుకోవాలని నోడల్ ఆఫీసర్ హరీష్ కుమార్ శర్మ తెలిపారు.

Similar News

News September 13, 2025

ఆసియా కప్‌: ఒమన్‌పై పాకిస్థాన్ విజయం

image

ఆసియా కప్‌లో భాగంగా ఒమన్‌తో జరిగిన మ్యాచులో పాకిస్థాన్ 93 పరుగుల తేడాతో విజయం సాధించింది. పాక్ నిర్దేశించిన 161 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో ఒమన్ బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. ఆ జట్టు 67 రన్స్‌కే ఆలౌట్ అయింది. హమద్ మీర్జా(27) టాప్ స్కోరర్‌గా నిలిచారు. పాక్ బౌలర్లలో అష్రఫ్, సుఫియాన్ ముకీమ్, సయీమ్ అయుబ్ తలో 2 వికెట్లతో రాణించారు.

News September 13, 2025

JNTU: బీటెక్ 1st ఇయర్ 2nd సెమిస్టర్ ఫలితాలు

image

జేఎన్టీయూ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన బీటెక్ 1st ఇయర్ 2వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను యూనివర్సిటీ ఎగ్జామినేషన్ డైరెక్టర్ విడుదల చేశారు. పరీక్షకు 16,521 మంది నమోదు చేసుకోగా 15,762 మంది హాజరయ్యారు. పరీక్షలు అన్ని సబ్జెక్టులలో 6,680 పూర్తిస్థాయి ఉత్తీర్ణత సాధించగా 42.38% పాస్ పర్సంటేజ్ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు.

News September 13, 2025

భవనం గుండా ఫ్లైఓవర్.. ఎక్కడంటే?

image

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఉంటాఖానా అశోక్ చౌక్‌ వద్ద నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్మిస్తోన్న ఫ్లైఓవర్ చర్చనీయాంశమవుతోంది. ఫ్లైఓవర్‌ను ఏకంగా నివాస భవనం గుండా తీసుకెళ్లడంతో ప్రజలు వింతగా చూస్తున్నారు. జవాబుదారీతనం లేకపోవడంతోనే ఇలా ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. గతంలోనూ ఓ రైల్వే ఓవర్ బ్రిడ్జిని 90 డిగ్రీల మలుపుతో నిర్మించిన విషయం తెలిసిందే.