News March 31, 2026

రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన కీలకం: కలెక్టర్

image

నిజామాబాద్‌లో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. బ్లాక్ స్పాట్‌లపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ఓవర్ స్పీడ్, డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. ప్రమాదాలను తగ్గించే విషయంలో అందరూ సమిష్టిగా కృషి చేయాలని అన్నారు.

Similar News

News April 20, 2026

నిజామాబాద్: ప్రజావాణికి 91 దరఖాస్తులు

image

నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ సమస్యలపై 91 ఫిర్యాదులు అందాయి. అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియాలు ఫిర్యాదుదారుల నుంచి వినతులను స్వీకరించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యతనిచ్చి, బాధితుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

News April 20, 2026

బినోలలో దొంగల బీభత్సం.. బంగారం అపహరణ

image

నవీపేట్ మండలం బినోలలో దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామానికి చెందిన నర్సమ్మ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగలగొట్టి సుమారు నాలుగు తులాల బంగారం అపహరించినట్లు ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరించారు. దొంగలను పట్టుకునేందుకు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.