News January 25, 2026

​లడ్డా – జిమిడిపేట మధ్య మూడో రైల్వే లైన్ ప్రారంభం

image

వాల్తేరు డివిజన్‌లోని లడ్డా-జిమిడిపేట స్టేషన్ల మధ్య నూతనంగా నిర్మించిన 7.181 కి.మీ.ల మూడో రైల్వే లైన్‌ను రైల్వే భద్రతా కమిషనర్ (CRS) బ్రిజేశ్ కుమార్ మిశ్రా శనివారం తనిఖీ చేశారు. తిత్లాగఢ్ – విజయనగరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ఈ మార్గంలో స్పీడ్ ట్రయల్స్ విజయవంతమయ్యాయి. భద్రతా ప్రమాణాల పరిశీలన అనంతరం రైళ్ల రాకపోకలకు అనుమతి లభించింది. ఈ కార్యక్రమంలో DRM లలిత్ బోహ్రా, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Similar News

News April 20, 2026

భీమిలిలో వ్యక్తి ఆత్మహత్య

image

భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సోమవారం జరిగింది. స్థానికంగా నివాసం ఉంటున్న మైలపల్లి సతీశ్ (35) చాకుతో చేతిని కోసుకున్నాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. భార్యాభర్తల మధ్య తలెత్తిన మనస్పర్ధలే ఈ ఘటనకు కారణమని భీమిలి ఎస్ఐ సురేశ్ తెలిపారు.

News April 20, 2026

విశాఖ రైతు బజార్లలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

విశాఖలోని పలు రైతు బజార్లలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు జేసీ విద్యాధరి సోమవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. పెందుర్తి రైతుబజార్‌లో నైట్ వాచ్‌మెన్‌ కమ్ స్వీపర్, సీతమ్మధార రైతుబజార్‌లో నైట్ వాచ్‌మెన్, సీతమ్మధార రైతుబజార్‌లో స్వీపర్, ఆరిలోవ రైతుబజార్‌లో డే వాచ్‌మెన్‌ పోస్టుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆసక్తి ఉన్నవారు గోపాలపట్నం ఉప మార్కెటింగ్ సంచాలకులకు ఏప్రిల్ 30 లోపు దరఖాస్తు చేసుకోవాలి.

News April 20, 2026

విశాఖ – భువనేశ్వర్ స్పెషల్ రైలు (08512) రీషెడ్యూల్

image

సింహాచలం చందనోత్సవం సందర్భంగా ప్రకటించిన 08512 నంబర్ గల విశాఖపట్నం – భువనేశ్వర్ స్పెషల్ జనసాధారణ్ రైలు రీషెడ్యూల్ అయింది. ఈ రైలు ఏప్రిల్ 20న ఉదయం 10.30 గంటలకు బయలుదేరాల్సి ఉండగా, అనివార్య కారణాల వల్ల మధ్యాహ్నం 3.30 గంటలకు బయలుదేరుతుందని అధికారులు స్పష్టం చేశారు. ప్రయాణికులు ఈ సమయ మార్పును గమనించాలని సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.పవన్ కుమార్ కోరారు.