News April 7, 2026
లావేరులో గుర్తు తెలియని వ్యక్తి మృతి

లావేరు మండలం తాళ్లవలస హైవేపై సోమవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వృద్ధుడు మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 60 నుంచి 70 ఏళ్ల వయస్సు గల మూగ వ్యక్తి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా, గుర్తుతెలియని వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు బిస్కట్ రంగు చొక్కా, లుంగీ ధరించి ఉన్నాడన్నారు. లావేరు పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
Similar News
News April 20, 2026
శ్రీకాకుళం: పద్మ పురస్కారాలకి నామినేషన్ల ఆహ్వానం

పద్మ పురస్కారాలకి నామినేషన్ల ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 31 వరకు ఆన్లైన్లో వివరాలు https://awards.gov.inలో నమోదు చేసుకోవాలన్నారు.
జిల్లాలోని వివిధ రంగాలకు చెందిన ప్రతిభావంతులు, నిస్వార్థ సేవకుల నుంచి 2027 సంవత్సరపు ‘పద్మ’ పురస్కారాలకు ప్రతిపాదనలు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు.

శ్రీకాకుళం: ఇంటర్మీడియట్ ఫెయిలైన వారికి గమనిక

ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ ఏడాది ఫీజుల స్వీకరణ సోమవారం నుంచి ప్రారంభమైనట్లు శ్రీకాకుళం ఆర్ఐఓ ఆర్. సురేశ్ కుమార్ తెలిపారు. ఈ నెల 27 లోపు ఫీజులు చెల్లించాలన్నారు. ఫెయిలైన వారు, మొదటి ఏడాది, రెండో ఏడాది ఇంప్రూవ్మెంట్ పరీక్ష రాసేవారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ద్వితీయ సంవత్సరం ఇంప్రూవ్మెంట్ రాసేందుకు ఈ ఏడాది కొత్తగా అవకాశం కల్పించినట్లు చెప్పారు.