News April 1, 2026
లింగ నిర్ధారణపై కఠిన నిఘా అవసరం: DMHO

ఆడశిశు గర్భస్రావాలు, గర్భపాతాలు, లింగనిర్ధారణ వంటి చట్టవిరుద్ధ చర్యలపై కఠిన నిఘా అవసరమని DMHO డా.రామారావు తెలిపారు. జిల్లాలో లింగ నిష్పత్తి తగ్గకుండ ఉండటం కోసం PCPNDT చట్టం-1994ను పకడ్బందీగా అమలు చేయాలని చెప్పారు. ఈ చట్టాన్ని ఉల్లంఘించే వ్యక్తులు, సంస్థలపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదని హెచ్చరించారు. అర్హత కల్గిన రేడియాలజిస్ట్/గైనకాలజిస్ట్ మాత్రమే స్కాన్ కేంద్రాలను నిర్వహించాలన్నారు.
Similar News
News April 20, 2026
KMM: మొక్కజొన్న కొనుగోళ్లపై కలెక్టర్లకు మంత్రి తుమ్మల ఆదేశాలు

మొక్కజొన్న కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చోట అదనపు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మార్క్ఫెడ్ ద్వారా 200 కేంద్రాల్లో కొనుగోళ్లు కొనసాగుతున్నాయని తెలిపారు. కొనుగోలు చేసిన మొక్కజొన్నను వెంటనే గోదాములకు తరలించేలా చర్యలు తీసుకోవాలని మార్క్ఫెడ్ అధికారులను సూచించారు.

అందుబాటులోకి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే

జిల్లా ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే (ప్యాకేజీ-2) సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. వైరా మండలంలోని సోమవరం ఎగ్జిట్ పాయింట్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని దేవరపల్లి వరకు నిర్మించిన ఈ రహదారిని అధికారులు ప్రారంభించారు. నేటి నుంచి టోల్ వసూళ్లు మొదలయ్యాయి. కాగా, ఈ రహదారిపై ద్విచక్ర వాహనాలు, ఆటోలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.