News March 9, 2026

లోన్ యాప్‌లపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

image

అనుమానాస్పద లోన్ యాప్‌లను డౌన్‌లోడ్ చేయవద్దని ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రజలను కోరారు. తక్కువ సమయంలోనే లోన్లు ఇస్తామని సోషల్ మీడియా, మెసేజ్‌ల ద్వారా వచ్చే ప్రలోభాలకు గురికావద్దని హెచ్చరించారు. లోన్ అవసరమైతే కేవలం గుర్తింపు పొందిన బ్యాంకులు మాత్రమే సంప్రదించాలన్నారు. ఎవరైనా యాప్‌ల ద్వారా వేధింపులకు లేదా బెదిరింపులకు పాల్పడితే వెంటనే 1930 నంబర్‌కు లేదా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News April 20, 2026

9 మందికి కారుణ్య నియామక ఉద్యోగాలు

image

రెవెన్యూ శాఖలో కారుణ్య నియామకాల కింద 8 మందికి ఆఫీస్ సబార్డినేట్, ఒకరికి జూనియర్ అసిస్టెంట్‌గా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి నియామక ఉత్తర్వులు అందజేశారు. సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఆమె అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి డీఆర్ఓ చిరంజీవి పాల్గొన్నారు.

News April 20, 2026

అగ్నిమాపక సిబ్బంది సేవలు అభినందనీయం: కలెక్టర్ డా.సిరి

image

ఆపద సమయాల్లో అగ్నిమాపక సిబ్బంది అందిస్తున్న సేవలు ఎంతో అభినందనీయమని కలెక్టర్ డా.సిరి కొనియాడారు. సోమవారం అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా కర్నూలు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన పరికరాల ప్రదర్శనను ఆమె తిలకించారు. అగ్ని ప్రమాదాల నివారణకు సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. ప్రమాదాల పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండాలని, అప్రమత్తంగా ఉంటూ ప్రాణ ఆస్తి నష్టాలను నివారించాలని కలెక్టర్ సూచించారు.

News April 20, 2026

కర్నూలు: కాలువలో పడి 6ఏళ్ల చిన్నారి మృతి

image

కర్నూలు జిల్లా కౌతాళం మండలం కామవరం గ్రామంలో ఆరేళ్ల బాలిక రక్షిత మృతి చెందడం విషాదాన్ని నింపింది. శనివారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లిన చిన్నారి అదృశ్యం కాగా, ఆదివారం గ్రామ సమీపంలోని LLC కాలువలో మృతదేహం లభ్యమైంది. ప్రమాదవశాత్తు కాలువలో పడి ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు అనుమానిస్తున్నారు. తమ గారాల పట్టి మరణంతో తల్లి నరసమ్మ, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.