News February 5, 2025
వరంగల్: క్వింటా పత్తి ధర రూ. 6,980
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం పత్తి ధర స్వల్పంగా పెరిగింది. సోమవారం క్వింటా పత్తి ధర రూ.7,000 పలకగా.. మంగళవారం రూ.6,960కి పడిపోయింది. అలాగే నేడు రూ.20 పెరిగి రూ.6,980 కి చేరినట్లు మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి నిర్మల తెలిపారు. గత వారం క్రమంగా పెరుగుతూ వచ్చిన పత్తి ధర ఇప్పుడు తగ్గుతుండటంతో రైతన్నలు ఆవేదన చెందుతున్నారు.
Similar News
News February 5, 2025
JF కెనడీ భార్యపైనే నెహ్రూకు మరింత ఆసక్తి: Forgotten Crisis బుక్
ఫారిన్ పాలసీపై ఆసక్తి ఉన్న, అర్థం చేసుకోవాలనుకున్న, భవిష్యత్తులో ఏదైనా చేయాలనుకునే వారు JFK’s Forgotten Crisis బుక్ చదవాలని రాహుల్‌ను ఉద్దేశించి మోదీ నిన్న సూచించారు. ఫారిన్ పాలసీ పేరుతో 1962లో ఆడిన ఆట గురించి బాగా తెలుస్తుందంటూ సెటైర్ వేశారు. అప్పట్లో భారత పర్యటనకు వచ్చిన తనతో కాకుండా తన భార్య జాకీ, సోదరి జాక్/బాబీతో మాట్లాడేందుకే నెహ్రూ మరింత ఆసక్తి చూపినట్టు JF కెనడీ పేర్కొన్నట్టు అందులో ఉంది.
News February 5, 2025
ఏపీ నుంచి తెలంగాణ మీదుగా కుంభమేళాకు ప్రత్యేక రైళ్లు
జీవితంలో ఒక్కసారే వచ్చే మహా కుంభమేళాకు దక్షిణ మధ్య రైల్వే మరో 2 ప్రత్యేక రైళ్లు ప్రకటించింది. మచిలీపట్నం-దానాపూర్ మధ్య ఈ నెల 8, 16 తేదీల్లో ఈ రైళ్లు ఉ.11 గంటలకు బయల్దేరనున్నాయి. అలాగే దానాపూర్-మచిలీపట్నం మధ్య ఈ నెల 10, 18 తేదీల్లో మ.3.15 గంటలకు తిరిగి బయల్దేరనున్నాయి. విజయవాడ, ఖమ్మం, వరంగల్, పెద్దపల్లి, మంచిర్యాల నాగ్‌పూర్, మీదుగా ఈ రైళ్లు ప్రయాగ్‌రాజ్ వెళ్లనున్నాయి.
News February 5, 2025
అయిజ: యువకుడి పై కత్తితో దాడి.. గాయాలు
అయిజ నరసప్ప గుడి కాలనీకి చెందిన చేనేత కార్మికుడు నేష మోనాష్ పై అదే కాలనీలో నివాసం ఉంటున్న గూడు బాషా అనే వ్యక్తి బుధవారం ఉదయం ఇంట్లోకి చొరబడి కత్తితో దాడి చేశాడు. దీంతో మోనాష్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. మోనాష్ కుటుంబ సభ్యులు అతడిని ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.