News February 5, 2025

JF కెనడీ భార్యపైనే నెహ్రూకు మరింత ఆసక్తి: Forgotten Crisis బుక్

image

ఫారిన్ పాలసీపై ఆసక్తి ఉన్న, అర్థం చేసుకోవాలనుకున్న, భవిష్యత్తులో ఏదైనా చేయాలనుకునే వారు JFK’s Forgotten Crisis బుక్ చదవాలని రాహుల్‌ను ఉద్దేశించి మోదీ నిన్న సూచించారు. ఫారిన్ పాలసీ పేరుతో 1962లో ఆడిన ఆట గురించి బాగా తెలుస్తుందంటూ సెటైర్ వేశారు. అప్పట్లో భారత పర్యటనకు వచ్చిన తనతో కాకుండా తన భార్య జాకీ, సోదరి జాక్/బాబీతో మాట్లాడేందుకే నెహ్రూ మరింత ఆసక్తి చూపినట్టు JF కెనడీ పేర్కొన్నట్టు అందులో ఉంది.

Similar News

News February 8, 2026

JNTUHలో ‘బంగారు’తల్లి ఈమే!

image

జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ CSE విభాగంలో అల్లంరాజు శ్రీవల్లి ఉత్తమ ప్రతిభ కనబరిచింది. యూనివర్సిటీ నుంచి 4 గోల్డ్ మెడల్స్ సాధించి ఈ విద్యా సంవత్సరంలో ప్రత్యేక గుర్తింపు సాధించింది. క్యాంపస్ ప్లేస్మెంట్‌లో సైతం ప్రముఖ ఐటీ సంస్థలో ఉద్యోగం సైతం సాధించింది. తన తల్లిదండ్రులు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వొమ్ము చేయకుండా, వారి కలలు సాకారం చేశానని తెలిపింది.

News February 8, 2026

కిడ్నాప్ కేసులో నోటీసులు.. మంచు విష్ణు రిప్లై!

image

AP: తిరుపతిలోని MBUలో ఫీజులపై ఆందోళన చేసిన విద్యార్థి సంఘం నేతల <<19041650>>కిడ్నాప్ కేసు<<>> కొత్త మలుపు తిరిగింది. ఈ వ్యవహారంలో తిరుచానూరు పోలీసులు మంచు విష్ణుకు (A-3) 5న నోటీసులు జారీ చేశారు. 3 రోజుల్లో విచారణకు రావాలన్నారు. అయితే ఈ నెల 15 తర్వాత విచారణకు హాజరవుతానని విష్ణు తెలిపినట్లు సమాచారం. ఈ కేసులో వర్సిటీ PRO సతీశ్ (A-1) సహా పలువురు ఇప్పటికే అరెస్టయ్యారు. A-2గా ఉన్న మోహన్ బాబుకు ఇంకా నోటీసులు అందలేదు.

News February 8, 2026

టాటా ఈవీలపై భారీ డిస్కౌంట్లు!

image

టాటా మోటార్స్ గుడ్ న్యూస్ చెప్పింది. తమ ఎలక్ట్రిక్ వెహికల్స్(EV)పై ₹3.80 లక్షల వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది. అత్యధికంగా కర్వ్‌పై ₹3.80 లక్షలు-₹3.30 లక్షల దాకా తగ్గించింది. హారియర్-₹1.5 లక్షలు, పంచ్-₹1.6 లక్షలు, టియాగో-₹1.5 లక్షలు, నెక్సాన్‌పై ₹1.2 లక్షలు డిస్కౌంట్ ఇస్తోంది. ఇయర్ వేరియంట్స్‌ను బట్టి ధరల్లో మార్పులు ఉండనున్నాయి.