News October 8, 2025

వరంగల్: జంప్ కొడుదాం.. టికెట్ పడుదాం!

image

స్థానిక ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లాలో BRS, BJPతో పాటు అధికార కాంగ్రెస్ కసరత్తు మొదలుపెట్టింది. మాజీ మంత్రులు, మాజీ MLA(BRS)లు ఇప్పటికే సమావేశాలు నిర్వహించి ఆశావహులకు దిశానిర్దేశం చేస్తున్నారు. టికెట్ ఆశించే పలువురు పార్టీలు మారుతున్నారు. అయితే, గతంతో పోలిస్తే జిల్లాలో BJP కాస్త మెరుగవడంతో పార్టీ పెద్దలను పల్లె పోరుకు సిద్ధమవుతున్న నాయకులు కలుస్తున్నారు. ఎన్నికలపై నేడు స్పష్టత రానుంది.

Similar News

News October 8, 2025

సత్యం VS సుంకే.. చొప్పదండిలో ‘WILD పాలిటిక్స్’..!

image

హత్యా బెదిరింపులు, సూసైడ్ అటెంప్టులు, PSలో కేసులు వెరసి చొప్పదండి MLA, మాజీ MLAల మధ్య పాలిటిక్స్ వైల్డ్‌గా మారాయి. MLA సత్యంను దూషిస్తే హత్య చేస్తామంటూ మాజీ MLA రవిశంకర్‌కు బెదిరింపు CALLS రావడంతో PSలో ఫిర్యాదయ్యారు. MLAనే కేసు పెట్టించి పోలీసులతో కొట్టించడంతోనే హిమ్మత్ నగర్‌వాసి శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నం చేశాడని సుంకే ఆరోపించారు. MLA, మాజీ MLA మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేట్లు పరిస్థితులున్నాయి.

News October 8, 2025

బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో వాదనలు

image

TG: బీసీ రిజర్వేషన్ల పెంపు GOపై విచారణ జరుపుతున్న హైకోర్టు.. బిల్లు పాస్ అయిందా అని ప్రశ్నించింది. అసెంబ్లీలో పాస్ అయిందని, గవర్నర్ దగ్గర పెండింగ్‌లో ఉందని అడ్వకేట్ జనరల్ చెప్పారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనా.. రిజర్వేషన్లు 50 శాతం మించితే ఎన్నికలు రద్దు అవుతాయనే నిబంధన ఉందని పిటిషనర్ల తరఫు లాయర్లు వాదించారు. వన్‌మెన్ కమిషన్ నివేదికను బహిర్గతం చేయలేదని పేర్కొన్నారు.

News October 8, 2025

ఏయూ స్నాతకోత్సవం వాయిదా

image

ఆంధ్ర విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం వాయిదా పడిందని రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు ప్రకటన జారీ చేశారు. ఈ నెల 15వ తేదీన ఉదయం 11 గంటలకు ఆంధ్ర విశ్వవిద్యాలయం 91, 92 సంయుక్త స్నాతకోత్సవం జరగాల్సి ఉంది. ఈ స్నాతకోత్సవాన్ని తాత్కాలికంగా వాయిదా వేశామని, తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలో తెలియజేస్తామని రిజిస్ట్రార్ తెలిపారు.