News August 11, 2025

వరంగల్: ‘భూభారతి’ మాడ్యూల్‌లో లేనివే ఎక్కువ..!

image

ఉమ్మడి జిల్లాలో 1,378 రెవెన్యూ సదస్సులు నిర్వహించగా 2,27,961 భూభారతి దరఖాస్తులను రైతులు అందజేశారు. వరంగల్‌లో 54,933, BHPL 48,651, MHBD 39,419, జనగామ 17,867, HNK 34,973, ములుగులో 31,118 దరఖాస్తులు వచ్చాయి. సాదాబైనామాలు,మిస్సింగ్ సర్వే నంబర్లు, ప్రొహిబిటెడ్ జాబితా నుంచి తొలగింపు వంటి సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరారు. వీటిలో ఎక్కువ దరఖాస్తులు భూభారతి మాడ్యూల్ పరిధిలో లేనట్లు అధికారులు తెలిపారు.

Similar News

News April 19, 2026

భీమవరంలో చికెన్ ధర ఎంతంటే?

image

భీమవరంలో ఆదివారం మాంసం ధరలు ఆకాశాన్నంటాయి. బాయిలర్ కోడి కిలో రూ.300, ఫారం కోడి రూ.260కు చేరగా.. మటన్ ధర ఏకంగా రూ.1000 పలుకుతోంది. గత రెండు రోజులతో పోలిస్తే చికెన్ ధరలు రూ.20 నుంచి రూ.40 వరకు పెరిగాయని వ్యాపారులు తెలిపారు. చేపలు రకాన్ని బట్టి రూ.150 నుంచి రూ.180 వరకు విక్రయిస్తున్నారు. ధరలు భారీగా పెరగడంతో సామాన్య వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి

News April 19, 2026

అనంత: గల్లంతైన బంగారం.. ఇంటి పెరట్లో ప్రత్యక్షం!

image

ఇంట్లో కనపడకుండా పోయిన 10 తులాల బంగారు ఆభరణాలు అదే ఇంటి పెరట్లో ప్రత్యక్షమయిన ఘటన అనంత(D) బుక్కరాయసముద్రంలో శనివారం జరిగింది. శివప్రసాద్, లక్ష్మి దంపతులు గత నెల 25న తాడిపత్రిలో పెళ్లికి వెళ్లారు. తిరిగి వచ్చి నగలను కప్ బోర్డులో పెట్టారు. ఈనెల 4న మరో వివాహానికి వెళ్లేందుకు ఆభరణాల కోసం చూడగా కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, లక్ష్మి పెరట్లో చెత్త ఊడుస్తుండగా ఆ ఆభరణాలు కనిపించాయి.

News April 19, 2026

కేజీ చికెన్ ధర ఎంతంటే?

image

హైదరాబాద్‌లో కేజీ స్కిన్ లెస్ చికెన్ ఏరియాను బట్టి రూ.270 నుంచి రూ.280 వరకు అమ్ముతున్నారు. వరంగల్‌లో రూ.270, కామారెడ్డి రూ.270, ఖమ్మంలో రూ.280కి విక్రయిస్తున్నారు. ఏపీలోని విజయవాడలో రూ.230, పల్నాడులో రూ.250-రూ.280, కర్నూలులో రూ.260, నంద్యాలలో రూ.280గా ఉంది. ప్రాంతాన్ని బట్టి ధరల్లో స్వల్ప తేడాలున్నాయి. మీ ప్రాంతంలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.