News March 1, 2025

వికారాబాద్ జిల్లా వాసులకు రేషన్ కార్డులు

image

వికారాబాద్ జిల్లాలో నూతనంగా 22,404 రేషన్ కార్డులు మంజూరు అయ్యాయి. మార్చి నుంచే రేషన్ బియ్యం అందించడం జరుగుతుందని వికారాబాద్ జిల్లా సివిల్ సప్లై అధికారి మోహన్ బాబు తెలిపారు. గతంలో 2,41,169 రేషన్ కార్డులు ఉన్నాయి. నూతనంగా మరో 22,404 మంజూరు అయ్యాయి. దీంతో జిల్లాలో రేషన్ కార్డుల సంఖ్య 2,63,573కు చేరింది. SHARE IT

Similar News

News March 1, 2025

మంచు కొండలు విరిగిపడిన ఘటన.. నలుగురు మృతి

image

ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్‌లో మంచు కొండలు విరిగిపడిన ఘటనలో నలుగురు మరణించారు. నిన్న మంచుచరియల కింద వీరు చిక్కుకోగా రెస్క్యూ సిబ్బంది వెలికితీసి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మరో ఆరుగురి కోసం ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. మొత్తం 57 మంది చిక్కుకోగా 47 మందిని ఆర్మీ రక్షించింది.

News March 1, 2025

తిరుపతి జిల్లాలో 92.42 శాతం ఫించన్ పంపిణీ  పూర్తి 

image

ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ జిల్లావ్యాప్తంగా కొనసాగుతుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం 12.40 వరకు జిల్లాలో 92.42 శాతం పంపిణీ పూర్తి అయినట్లు  అధికారులు వెల్లడించారు. యర్రావారిపాలెం 95.15 శాతంతో ముందు స్థానంలో ఉండగా పిచ్చాటూరు 88.64 శాతంతో చివరి స్థానంలో నిలిచింది. సాయంత్రానికి 100 శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు.

News March 1, 2025

పరీక్ష లేకుండా ఉద్యోగాలు.. ఎల్లుండే లాస్ట్ డేట్

image

పోస్టల్ శాఖలో బీపీఎం, ఏబీపీఎం పోస్టులకు దరఖాస్తు గడువు ఈ నెల 3తో ముగియనుంది. మొత్తం 21,413 ఖాళీలకుగాను ఏపీలో 1,215, తెలంగాణలో 519 పోస్టులు ఉన్నాయి. రాతపరీక్ష లేకుండా టెన్త్ క్లాస్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. 18-40 ఏళ్ల వారు అర్హులు కాగా రిజర్వేషన్ బట్టి వయోసడలింపు ఉంది. ఈ నెల 6 నుంచి 8 వరకు తప్పుల సవరణకు పోస్టల్ శాఖ అవకాశం కల్పించింది.
వెబ్‌సైట్: https://indiapostgdsonline.gov.in/

error: Content is protected !!