News March 1, 2025
పరీక్ష లేకుండా ఉద్యోగాలు.. ఎల్లుండే లాస్ట్ డేట్

పోస్టల్ శాఖలో బీపీఎం, ఏబీపీఎం పోస్టులకు దరఖాస్తు గడువు ఈ నెల 3తో ముగియనుంది. మొత్తం 21,413 ఖాళీలకుగాను ఏపీలో 1,215, తెలంగాణలో 519 పోస్టులు ఉన్నాయి. రాతపరీక్ష లేకుండా టెన్త్ క్లాస్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. 18-40 ఏళ్ల వారు అర్హులు కాగా రిజర్వేషన్ బట్టి వయోసడలింపు ఉంది. ఈ నెల 6 నుంచి 8 వరకు తప్పుల సవరణకు పోస్టల్ శాఖ అవకాశం కల్పించింది.
వెబ్‌సైట్: https://indiapostgdsonline.gov.in/
Similar News
News March 19, 2025
ఉస్మానియా.. గత వైభవం ఏది?

తెలంగాణకు గర్వకారణమైన ఉస్మానియా యూనివర్సిటీ సమస్యల వలయంలో చిక్కుకుంది. ఫుడ్ బాగుండట్లేదని, బొద్దింకలు, వెంట్రుకలు వస్తున్నాయని విద్యార్థులు ఫిర్యాదులు చేస్తున్నారు. ఇటీవల ఏకంగా బ్లేడ్ రావడం కలకలం రేపింది. ఉదయం నీళ్లు లేకపోవడంతో స్నానం చేయకుండానే క్లాసులకు వెళ్లాల్సి వస్తోందంటున్నారు. ఫ్యాకల్టీ సైతం రోజూ రావట్లేదని చెబుతున్నారు. వెంటనే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. COMMENT?
News March 19, 2025
రాష్ట్రంలో త్వరలో 25,190 ఉద్యోగాల భర్తీ: భట్టి

TG: త్వరలోనే 14,236 అంగన్ వాడీ పోస్టులను భర్తీ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. రెవెన్యూ విభాగంలో 10,954 గ్రామస్థాయి పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. నిరుద్యోగులకు నాలెడ్జ్ సెంటర్లలో గ్రూప్-1, గ్రూప్-2 ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఫలితాలు ప్రకటించిన పరీక్షలకు సంబంధించి త్వరలోనే నియామక పత్రాలు ఇస్తామన్నారు.
News March 19, 2025
అసెంబ్లీ ఎల్లుండికి వాయిదా

TG: అసెంబ్లీ ఎల్లుండికి వాయిదా పడింది. ఇరు సభల్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం సభలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. తిరిగి శుక్రవారం అసెంబ్లీ ప్రారంభం కానుంది.