News April 18, 2026
విశాఖ – షాలిమార్ మధ్య స్పెషల్ రైలు

వేసవి రద్దీ దృష్ట్యా విశాఖపట్నం – షాలిమార్ మధ్య ప్రత్యేక రైలును నడుపుతున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రకటించింది. రైలు (08504) ఏప్రిల్ 22న రాత్రి 11:45కు విశాఖలో బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 3 గంటలకు షాలిమార్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో (08505) ఏప్రిల్ 23న సాయంత్రం 6 గంటలకు షాలిమార్ నుంచి బయలుదేరుతుందని సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె. పవన్ కుమార్ తెలిపారు.
Similar News
News April 20, 2026
భీమిలిలో వ్యక్తి ఆత్మహత్య

భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సోమవారం జరిగింది. స్థానికంగా నివాసం ఉంటున్న మైలపల్లి సతీశ్ (35) చాకుతో చేతిని కోసుకున్నాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. భార్యాభర్తల మధ్య తలెత్తిన మనస్పర్ధలే ఈ ఘటనకు కారణమని భీమిలి ఎస్ఐ సురేశ్ తెలిపారు.
News April 20, 2026
విశాఖ రైతు బజార్లలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

విశాఖలోని పలు రైతు బజార్లలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు జేసీ విద్యాధరి సోమవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. పెందుర్తి రైతుబజార్‌లో నైట్ వాచ్‌మెన్ కమ్ స్వీపర్, సీతమ్మధార రైతుబజార్‌లో నైట్ వాచ్‌మెన్, సీతమ్మధార రైతుబజార్‌లో స్వీపర్, ఆరిలోవ రైతుబజార్‌లో డే వాచ్‌మెన్ పోస్టుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆసక్తి ఉన్నవారు గోపాలపట్నం ఉప మార్కెటింగ్ సంచాలకులకు ఏప్రిల్ 30 లోపు దరఖాస్తు చేసుకోవాలి.
News April 20, 2026
విశాఖ – భువనేశ్వర్ స్పెషల్ రైలు (08512) రీషెడ్యూల్

సింహాచలం చందనోత్సవం సందర్భంగా ప్రకటించిన 08512 నంబర్ గల విశాఖపట్నం – భువనేశ్వర్ స్పెషల్ జనసాధారణ్ రైలు రీషెడ్యూల్ అయింది. ఈ రైలు ఏప్రిల్ 20న ఉదయం 10.30 గంటలకు బయలుదేరాల్సి ఉండగా, అనివార్య కారణాల వల్ల మధ్యాహ్నం 3.30 గంటలకు బయలుదేరుతుందని అధికారులు స్పష్టం చేశారు. ప్రయాణికులు ఈ సమయ మార్పును గమనించాలని సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.పవన్ కుమార్ కోరారు.


