News January 31, 2026

వైరాలో పొంగులేటితో భట్టి ‘ఢీ’

image

వైరా మున్సిపల్ ఎన్నికల్లో మంత్రులు పొంగులేటి, భట్టి మధ్య నడుస్తున్న కోల్డ్‌వార్ బహిర్గతమైంది. ఇక్కడ 20 డివిజన్లు ఉండగా 190 మంది నామినేషన్లు వేశారు. ఇందులో టికెట్ ఆశించిన ఇద్దరు మంత్రుల అనుచరులు ఏమాత్రం తగ్గేదే లే అంటూ మెజార్టీ డివిజన్లలో నామినేషన్లు వేశారు. తమ నేత ఆశీస్సులతో తమకే బి ఫారం వస్తుందని ధీమాగా ఉన్నారు. ఇద్దరు మంత్రుల్లో ఎవరిది పై చేయి అవుతుందో నామినేషన్ల ఉపసంహరణ రోజు వరకు ఆగాల్సిందే.

Similar News

News April 20, 2026

KMM: మొక్కజొన్న కొనుగోళ్లపై కలెక్టర్లకు మంత్రి తుమ్మల ఆదేశాలు

image

మొక్కజొన్న కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చోట అదనపు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మార్క్‌ఫెడ్ ద్వారా 200 కేంద్రాల్లో కొనుగోళ్లు కొనసాగుతున్నాయని తెలిపారు. కొనుగోలు చేసిన మొక్కజొన్నను వెంటనే గోదాములకు తరలించేలా చర్యలు తీసుకోవాలని మార్క్‌ఫెడ్ అధికారులను సూచించారు.

అందుబాటులోకి గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే

image

జిల్లా ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే (ప్యాకేజీ-2) సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. వైరా మండలంలోని సోమవరం ఎగ్జిట్ పాయింట్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని దేవరపల్లి వరకు నిర్మించిన ఈ రహదారిని అధికారులు ప్రారంభించారు. నేటి నుంచి టోల్ వసూళ్లు మొదలయ్యాయి. కాగా, ఈ రహదారిపై ద్విచక్ర వాహనాలు, ఆటోలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.