News November 26, 2025

సర్పంచ్ ఎన్నికలు.. కలెక్టర్ ఇలా త్రిపాఠి వార్నింగ్

image

ఎన్నికల విధుల్లో అలసత్వం, నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. విధులకు హాజరు కాకపోయినా సస్పెండ్ చేస్తామని ఆమె స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లో ఎన్నికల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎంపీడీఓలు, ఎంపీఓలు పోలింగ్ కేంద్రాలను మరోసారి పరిశీలించాలని ఆమె తెలిపారు.

Similar News

News February 13, 2026

మిర్యాలగూడలో ఒక్క ఓటుతో విజయం

image

మిర్యాలగూడ 18వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి బూడిద సైదులు సంచలన విజయం సాధించారు. అత్యంత హోరాహోరీగా సాగిన కౌంటింగ్‌లో సైదులుకు 837 ఓట్లు రాగా, సమీప బీఆర్ఎస్ అభ్యర్థికి 836 ఓట్లు పోలయ్యాయి. కేవలం ఒక్క ఓటు మెజారిటీతో ఆయన గెలుపొందారు. ఈ ఉత్కంఠ విజయంతో అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. వార్డు అభివృద్ధికి నిరంతరం అందుబాటులో ఉంటానని సైదులు కృతజ్ఞతలు తెలిపారు.

News February 13, 2026

దేవరకొండ: మున్సిపల్ పీఠం కాంగ్రెస్ కైవసం

image

దేవరకొండ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించింది. మొత్తం 20 వార్డులకు గాను 11 స్థానాలను గెలుచుకుని, స్పష్టమైన మెజార్టీతో మున్సిపల్ పీఠాన్ని దక్కించుకుంది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ 6 స్థానాలకే పరిమితం కాగా, బీజేపీ కేవలం ఒక వార్డులో మాత్రమే విజయం సాధించింది. ఓటర్లు మార్పు కోరుకుంటూ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడంతో పట్టణంలో పార్టీ శ్రేణులు బాణసంచా కాల్చి భారీ ఎత్తున సంబరాలు జరుపుకున్నారు.

News February 13, 2026

NLG: మున్సిపల్ ఫలితాలు.. మధ్యాహ్నానికే స్పష్టత!

image

నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ తో సహా జిల్లాలో ఆరు మున్సిపాలిటీలలో ఎన్నికల ఫలితాలు ఉదయం 8గంటలకు ప్రారంభమై11:30 వరకు పూర్తయ్యే అవకాశముంది. దేవరకొండ, చండూరు, చిట్యాల, నందికొండ, హాలియాలో 20 వార్డులలోపే ఉండడంతో లెక్కింపు ప్రారంభమైన 2 గంటల వ్యవధిలోనే వీటి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్, మిర్యాలగూడ మున్సిపాలిటీ కౌంటింగ్ తుది ఫలితాలు ఉదయం 11:30 గంటలకు వెలువడనున్నాయి.