News February 1, 2026
సిట్ విచారణకు KCR.. సిటీలో BRS ప్లాన్ ఇదే?

నేడు KCR సిట్ విచారణ నేపథ్యంలో నగరంలో BRS నేతలు భారీ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎర్రవెల్లిలోని ఫాంహౌస్‌లో ఉన్న KCR ఉదయం 11 గంటలకు నందినగర్‌లోని నివాసానికి రానున్నారు. అయితే, KCR మీద కక్ష పూరితంగా ప్రభుత్వం విచారణకు పిలుస్తోందని BRS నేతలు ఇప్పటికే ఖండించారు. అన్ని ఏరియాల్లో నిరసన తెలపాలని మరోవైపు KTR పిలుపునిచ్చారు. సిటీలో BRS నేతలు బల ప్రదర్శన చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.
Similar News
News April 20, 2026
కొడంగల్: CM ఇలాకాలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో రూ.224 కోట్లతో 450 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తున్నారు. కాగా, రాష్ట్రంలోని పెద్ద సర్కార్ దవాఖానాలైన గాంధీ (2,000+ పడకలు), ఉస్మానియా (1,168+ పడకలు) తర్వాత, ప్రాంతీయ స్థాయిలో ఇంతటి ఆధునిక వైద్యశాల రావడం ఇదే తొలిసారి. ఈ భారీ నిర్మాణం పూర్తయితే కొడంగల్‌తో పాటు పరిసర జిల్లాలకు ఎంతో ఉపయోగపడనుంది.

HYDలో త్వరలో మరో IVF సెంటర్

HYD హైకోర్టు సమీపంలోని పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రిలో త్వరలో IVF కేంద్రం అందుబాటులోకి రానుంది. గాంధీ ఆసుపత్రిలో IVF సెంటర్ సక్సెస్ అయిన నేపథ్యంలో ఇక్కడా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు DME నరేందర్ కుమార్ తెలిపారు. సుమారుగా 490 పడకల సామర్థ్యంతో, డాక్టర్లతో అద్భుతమైన సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రెగ్నెన్సీ పరీక్షలు చేయడం, పసిపిల్లలకు వైద్యం, పిల్లల తల్లులకు అడ్వాన్స్‌డ్ వైద్యం అందించనున్నారు.