News March 9, 2025
సిద్దిపేట కలెక్టరేట్‌లో రేపు ప్రజావాణి

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసినందున ఈ నెల 10న సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి జిల్లా ప్రజలకు తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించి తమ తమ సమస్యల పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Similar News
News March 10, 2025
KNR: ఈ సోమవారం ప్రజావాణి యథాతథం: కలెక్టర్

ప్రతి సోమవారం కరీంనగర్ కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం సోమవారం నుంచి యథావిధిగా కొనసాగుతుందని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా రద్దు చేయబడిన ప్రజావాణిని తిరిగి సోమవారం నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రజలు తమ అర్జీలను సమర్పించాలని సూచించారు.
News March 10, 2025
మార్చి 10: చరిత్రలో ఈ రోజు

*1876: అలెగ్జాండర్ గ్రాహం బెల్ విజయవంతంగా మొదటి టెలిఫోన్ కాల్ చేశారు
*1896: రంగస్థల నటుడు నిడుముక్కల సుబ్బారావు జననం
*1897: సావిత్రిబాయి ఫూలే మరణం
*1982: ప్రముఖ వైద్యుడు జి.ఎస్.మేల్కోటే మరణం
*1990: సినీ నటి రీతూ వర్మ జననం
*అంతర్జాతీయ మహిళా న్యాయమూర్తుల దినోత్సవం
News March 10, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.