News April 13, 2025
సిద్దిపేట: RYVకి అప్లై చేశారా.. 14 వరకే ఛాన్స్

యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘రాజీవ్ యువ వికాసం పథకం’ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. శనివారం వరకు జిల్లాలో 15 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. రేపటి వరకు ఛాన్స్ ఉన్నందున ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అధికారులు సూచించారు. అర్హుల ఎంపిక పారదర్శకంగా ఉంటుందన్నారు.
Similar News
News April 14, 2026
నవ్వు వెనుక తీరని విషాదం.. చిత్ర ట్వీట్ వైరల్!

చెరగని చిరునవ్వుతో, మధురమైన గొంతుతో మనల్ని అలరించే సింగర్ చిత్ర మనసులో తీరని వేదన దాగి ఉందనే విషయం మీకు తెలుసా? 2011లో దుబాయ్‌లో తన ఒక్కగానొక్క బిడ్డ నందన కళ్లముందే స్విమ్మింగ్ పూల్‌లో పడి కన్నుమూశారు. ఇవాళ ఆమె వర్ధంతి కావడంతో చిత్ర భావోద్వేగ ట్వీట్ చేశారు. బిడ్డ లేదన్న నిజం ఎప్పటికీ బాధిస్తూనే ఉంటుందని, కానీ తన గుండెల్లో ఎప్పటికీ ఉంటుందని చిత్ర రాసుకొచ్చారు. ఇది చూసి ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు.
News April 14, 2026
ములుగు: ఆ గ్రామాలకు ట్యాంకుల ద్వారా తాగునీటి సరఫరా!

ఏటూరునాగారం మండలం గంటలకుంట, మామిడిగూడెంలో ‘మురుగునీరే విద్యార్థులకు తాగునీరు’ అనే శీర్షిక సోమవారం Way2News కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. మంత్రి సీతక్క ఆదేశాలతో కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి దేవేందర్ వాటర్ ట్యాంక్ ద్వారా గ్రామస్థుల నీరు సరఫరా చేస్తున్నారు. నీటి కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అవసరమైతే సొంత ఖర్చులతో బోర్లు వేయించేందుకు మంత్రి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.
News April 14, 2026
HYDతో అంబేడ్కర్‌కు విడదీయలేని అనుబంధం

Dr.BR.అంబేడ్కర్‌కి HYDతో విడదీయలేని అనుబంధం ఉంది. 1932లో తొలిసారి నగరానికి రాగా, 1944లో జింఖానా గ్రౌండ్స్‌లో బహిరంగ సభలో మాట్లాడి దళితులను చైతన్యపరిచారు. 1953లో నిజాం కాలేజీలో ఆయన ప్రసంగం విని ఆకర్షితుడైన నిజాం ఆయనను HYD స్టేట్‌కు చీఫ్ జస్టిస్‌గా నియమించాలనుకున్నారు. సామాజిక సంస్కరణలు, విద్యావ్యాప్తికి ఆయన పలుమార్లు ఇక్కడికి వచ్చారు. ట్యాంక్ బండ్‌పై ఆయన భారీ విగ్రహం నగరానికి ప్రతీకగా నిలిచింది.


