News April 23, 2025
సిరిసిల్ల జిల్లాలోని ఉష్ణోగ్రత వివరాలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గడిచిన 24 గంటల్లో ఉష్ణోగ్రతలు ఇలా నమోదయ్యాయి. సిరిసిల్ల 43.7°c, ఇల్లంతకుంట 43.6 °c,వేములవాడ రూరల్ 43.6°c, బోయిన్పల్లి 43.6 °c,కోదరావుపేట 43.4°c, తంగళ్ళపల్లి 43.3, వీర్నపల్లి 43.1, రుద్రంగి 42.8 °c, గంభీరావుపేట 42.8 °c,ఎల్లారెడ్డిపేట 42.6 °c,ముస్తాబాద్ 41.1°cలుగా నమోదయినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
Similar News
News April 15, 2026
పోరుమామిళ్ల: ఇంటర్‌లో ఫెయిల్.. విద్యార్థి ఆత్మహత్యాయత్నం

పోరుమామిళ్ల మండలానికి చెందిన విద్యార్థి ఇంటర్‌లో ఫెయిల్ అవడంతో మనస్తాపం చెంది పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గుర్తించి పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. పరిస్థితి విషమించడంతో కడప రిమ్స్‌కు రిఫర్ చేశారు. డాక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ.. విద్యార్థి తాగిన పాయిజన్ అత్యంత ప్రమాదకరమని, పరిస్థితి తీవ్రంగా ఉందని తెలిపారు.
News April 15, 2026
TU: ఉమ్మడి జిల్లాలో 29 పరీక్ష కేంద్రాలు

TU పరిధిలోని ఉమ్మడి జిల్లాలో జరిగే డిగ్రీ (BA/BCom/BSc/BBA) 2, 4, 6 రెగ్యులర్, 1, 3, 5 బ్యాక్ లాగ్ సెమిస్టర్ల పరీక్షలకు 29 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొ.జి.చంద్రశేఖర్ తెలిపారు. ఈ నెల 18 నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు కేటాయించిన పరీక్షా కేంద్రాలకు సమయానికి ముందే చేరుకోవాలన్నారు. వివరాలకు వర్సిటీ వెబ్సైట్ చూడాలన్నారు.
News April 15, 2026
ఆయిల్ కంపెనీలకు రోజుకు ₹1,600 కోట్ల నష్టం?

అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగినా మన దేశంలో మాత్రం పెట్రోల్, డీజిల్ ప్రైసెస్ మారలేదు. దీంతో ఆయిల్ కంపెనీలకు భారీ నష్టం వస్తున్నట్లు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. లీటర్ పెట్రోల్‌పై ₹18, డీజిల్‌పై ₹35 వరకు నష్టపోతున్నట్లు సమాచారం. మొత్తంగా ఒక రోజుకు ఆయిల్ కంపెనీలు ₹1,600 కోట్లు నష్టపోతున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే ఆయా సంస్థలకు నెలకు ₹50,000 కోట్ల వరకు లాస్ తప్పదు.


