News April 5, 2026
సిరిసిల్ల : విద్యుత్ సిబ్బందికి రక్షణ కవచాలు అందజేత

విద్యుత్ సిబ్బందికి రక్షణ కల్పించే విషయంలో ఎన్పీడీసీఎల్ ముందడుగు వేసింది. గతంలో జరిగిన ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని సిబ్బందికి రక్షణ కవచాలు అందించింది. లైన్ లో విద్యుత్ సరఫరా ఉంటే తెలిసిపోయేలా ఎర్త్ రాడ్లతో పాటు హెల్మెట్లు, జాకెట్ లు పంపిణీ చేశారు. కాగా సెస్ ను ఎన్పీడీసీఎల్ ఆధీనంలోకి తీసుకున్న మూడు రోజుల్లోనే రక్షణ కిట్లు పంపిణీ చేయడం పట్ల సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News April 15, 2026
అన్నమయ్య: నేడు ఫలితాలు.. మార్కులే జీవితం కాదు.. బ్రో

అన్నమయ్య జిల్లాలో ఇంటర్-1, సెకండియర్ విద్యార్థులు 27935 పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాల సమయంలో కొందరు విద్యార్థులు ఆందోళనకు గురయ్యేఅవకాశం ఉంది. మార్కులు తక్కువ వచ్చినా, ఫెయిల్ అయినా అది జీవితానికి ముగింపు కాదని, ఓటమి అనేది విజయానికి తొలి మెట్టని అధికారులు సూచిస్తున్నారు. <<19635802>>తల్లిదండ్రులు<<>>, ఉపాధ్యాయులు పిల్లలకు మానసికంగా అండగా నిలవాలని, అవసరమైతే విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని నిపుణులు తెలిపారు.
News April 15, 2026
బాపట్ల: 19,292 మంది ఎదురుచూపు.. కాసేపట్లో తెర

ఇంటర్మీడియట్ ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. బాపట్ల జిల్లాలో మొత్తం 19,292 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మొదటి సంవత్సరం 9,744 మంది, రెండో సంవత్సరం 9,548 మంది ఉన్నారు. 36 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలు ఇవాళ ఉదయం 10:31 కి విడుదల కానున్నాయి. అందరికంటే ముందుగా Way2Newsలో వేగంగా, సులభంగా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
News April 15, 2026
సిరిసిల్ల : సెస్ ఉద్యోగులకు బదిలీ భయం

సెస్ పాలకవర్గం వర్సెస్ ప్రభుత్వ పోరులో అందులో పని చేస్తున్న ఉద్యోగులు చిక్కారు. సెస్ ఎన్పీడీసీఎల్‌లో విలీనమైతే ఉద్యోగులకు బదిలీ తప్పదని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం కీలక పోస్టుల్లో ఎన్పీడీసీఎల్ అధికారులు ఉండగా, అడ్మినిస్ట్రేషన్, క్షేత్రస్థాయిలో సెస్ సిబ్బంది ఉన్నారు. సెస్ రద్దు అయితే ఉద్యోగుల బదిలీ పరిధి 17 జిల్లాకు మారనుంది. దీంతో 355 మంది ఉద్యోగుల్లో బదిలీ భయం పట్టుకుంది.


