News April 15, 2026

సిరిసిల్ల : సెస్ ఉద్యోగులకు బదిలీ భయం

image

సెస్ పాలకవర్గం వర్సెస్ ప్రభుత్వ పోరులో అందులో పని చేస్తున్న ఉద్యోగులు చిక్కారు. సెస్ ఎన్పీడీసీఎల్‌లో విలీనమైతే ఉద్యోగులకు బదిలీ తప్పదని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం కీలక పోస్టుల్లో ఎన్పీడీసీఎల్ అధికారులు ఉండగా, అడ్మినిస్ట్రేషన్, క్షేత్రస్థాయిలో సెస్ సిబ్బంది ఉన్నారు. సెస్ రద్దు అయితే ఉద్యోగుల బదిలీ పరిధి 17 జిల్లాకు మారనుంది. దీంతో 355 మంది ఉద్యోగుల్లో బదిలీ భయం పట్టుకుంది.

Similar News

News April 15, 2026

మద్దతు ధర దక్కక గుంటూరు రైతుల ఆవేదన

image

జిల్లాలో దిగుబడులు బాగున్నా మద్దతు ధర దక్కక రైతులు నష్టపోతున్నారు. ఇక్కడ 79,200 ఎకరాల్లో మొక్కజొన్న, 48,465 ఎకరాల్లో శనగ సాగైంది. మద్దతు ధర రూ.2,400 కాగా, ప్రైవేటు మార్కెట్‌లో రూ.1,700కే అమ్ముతూ క్వింటాల్‌కు రూ.700 నష్టపోతున్నారు. కంది మద్దతు ధర రూ.8 వేలు కాగా రూ.7 వేలకే ఇస్తున్నారు. శనగ రైతులకూ ఎకరాకు రూ.5 వేల నుంచి 7 వేల దాకా నష్టం వస్తోంది. నిల్వ సదుపాయాలు లేక దళారులకు తక్కువకి అమ్ముతున్నారు.

News April 15, 2026

ములుగు: యాసంగి వరి ధాన్యం నాణ్యత ప్రమాణాలు ఇవే!

image

యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు నాణ్యత ప్రమాణాలను (FAQ) వ్యవసాయ శాఖ అధికారులు విడుదల చేశారు. ధాన్యంలో తేమ 17 శాతం మించరాదని, వ్యర్థ పదార్థాలు 1%, రంగు మారిన మొలకెత్తిన గింజలు 4%, పక్వానికి రాని గింజలు 3%, బెరుకు గింజలు 6% మించొద్దని సూచించారు. సాధారణ రకం ధాన్యానికి క్వింటాలుకు రూ.2,369, గ్రేడ్ ఏ రకం ధాన్యానికి రూ.2,389 మద్దతు ధర ప్రభుత్వం చెల్లిస్తుందని వెల్లడించారు.

News April 15, 2026

SKLM: ఇద్దరిని చంపిన వ్యక్తి సూసైడ్

image

పలాస మండలం మహదేవపురానికి చెందిన రామారావు(45) మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. గతేడాది జరిగిన జంట హత్యల కేసులో నిందితుడైన ఇతడు, నెల కిందటే బెయిల్‌పై బయటకు వచ్చాడు. బుధవారంతో గడువు ముగియనుండగా, పూచీకత్తు ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో జీవిత ఖైదు తప్పదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్ఐ ఆర్‌వీఆర్ నాయుడు తెలిపారు.