News April 4, 2025
సెలవుల్లోనూ ప్రజాపాలన కేంద్రాలు: మేడ్చల్ అదనపు కలెక్టర్

రాజీవ్ యువ వికాసం పథకానికి అప్లై చేసుకునేందుకు సెలవు దినాల్లోనూ ప్రజాపాలన కేంద్రాలు పనిచేస్తాయని జిల్లా అదనపు కలెక్టర్ రాధిక గుప్త తెలిపారు. ఆఫ్‌లైన్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చన్నారు. ఈ విషయంలో ప్రజలు గమనించి ఎక్కువ సంఖ్యలో దరఖాస్తు చేసుకోవాలని అదనపు కలెక్టర్ సూచించారు. మున్సిపల్, ఎంపీడీవో కార్యాలయాల్లో రాజీవ్ యువ వికాసం పథకంపై ప్రజలకు మరింత అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Similar News
News April 12, 2025
రేపే రిజల్ట్స్.. ఆత్మహత్యలు వద్దు సోదరా!

సంవత్సరమంతా కష్టపడి చదివిన చదువుల ఫలితం రేపు తేలనుంది. ఉ.11 గంటలకు ఏపీ ఇంటర్ రిజల్ట్స్ రానున్నాయి. పిల్లలపై తల్లిదండ్రులకు అంచనాలు ఉండటం సహజం. కానీ ఫెయిల్ అయ్యారని, మార్కులు తక్కువ వచ్చాయని వాళ్లను తిట్టకండి. కనిపెంచిన మీరే వాళ్లపై నమ్మకం ఉంచి, ధైర్యం చెప్పకపోతే ఎలా? ప్రతికూల ఫలితాలు వచ్చినా భవిష్యత్తుపై నమ్మకం కలిగించండి. ఫెయిలైనంత మాత్రాన లైఫ్ ముగిసినట్టు కాదని పిల్లలూ గుర్తుంచుకోవాలి.
SHARE IT
News April 12, 2025
‘ఉపాధిహామీ పనులకు పెద్దఎత్తున మొబిలైజ్ చేయాలి’

ఉపాధిహామీ పథకం పనులకు పెద్దఎత్తున లేబర్‌ను మొబిలైజ్ చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. అధికారులతో ఆయన సమీక్షలో మాట్లాడుతూ.. మన జిల్లాలో ఉపాధిహామీ పథకం పనుల్లో ఆశించిన ప్రగతి రావడం లేదని అన్నారు. మన జిల్లాలో కూలిరేటు సరాసరి రూ.211 ఉన్నట్లు తెలిపారు. ప్రతి వారం ప్రగతి రావాలని, ఉపాధిహామీ పథకం పనులు వినియోగానికి ఈ రెండు నెలలు చాలా కీలకమని తెలిపారు.
News April 12, 2025
ధోనీపై తమిళ హీరో అసహనం

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీపై తమిళ సినీ హీరో విష్ణు విశాల్ అసహనం వ్యక్తం చేశారు. ‘లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు రావడం ఎందుకు? ఇదంతా ఓ సర్కస్‌లా ఉంది. స్పోర్ట్ కంటే ఎవరూ గొప్ప కాదు’ అని ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్‌కు పలువురు నెటిజన్లు మద్దతు తెలుపుతున్నారు. ఇవాళ KKRతో మ్యాచులో జట్టు కష్టాల్లో ఉండగా ధోనీ 9వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చారు. 4 బంతుల్లో ఒక్క రన్ మాత్రమే చేసి ఔటయ్యారు.