News June 12, 2024

₹300 జువెల్లరీ ₹6కోట్లకు అంటగట్టారు!

image

రాజస్థాన్‌లోని జోహ్రీ బజార్‌లో ఓ జువెల్లరీ షాపు ఓనర్లు ఓ US మహిళకు కుచ్చుటోపీ పెట్టారు. చెరిష్ అనే మహిళకు ₹300 ఆభరణానికి బంగారు పాలిష్‌ వేసి ₹6కోట్లకు రెండేళ్ల కిందట విక్రయించారు. నమ్మించేందుకు హాల్‌మార్క్ సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. అయితే అమెరికాలో జరిగిన ఎగ్జిబిషన్‌లో ఆభరణాన్ని తాజాగా ప్రదర్శించగా అది నకిలీదని తేలింది. ఆమె ఫిర్యాదుతో జైపూర్ పోలీసులు వ్యాపారులైన తండ్రి, కొడుకుపై కేసు నమోదు చేశారు.

Similar News

News December 23, 2024

ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదల

image

అగ్నిపథ్ స్కీమ్‌లో భాగంగా ఎయిర్‌ఫోర్స్‌లో నియామకాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 50% మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులతో ఇంటర్/తత్సమాన విద్య పూర్తిచేసిన వారు అర్హులు. జనవరి 7 నుంచి FEB 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 01-01-2005 నుంచి 01-07-2008 మధ్య జన్మించి ఉండాలి. రాత పరీక్ష, ఫిజికల్, మెడికల్ టెస్టుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
సైట్: <>https://agnipathvayu.cdac.in/<<>>

News December 23, 2024

రేపు, ఎల్లుండి భారీ వర్షాలు

image

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీనపడినప్పటికీ అనూహ్యంగా దిశ మార్చుకుంది. తీవ్ర అల్పపీడనంగా మారి దక్షిణ కోస్తా తీరం దిశగా పయనిస్తోంది. దీని ప్రభావంతో రేపు, ఎల్లుండి ఉత్తరాంధ్ర, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, ఉ.గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయంది.

News December 23, 2024

పీవీ సింధు పెళ్లి జరిగింది ఇక్కడే

image

రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లోని ఉదయ్‌సాగర్‌ సరస్సులో 21 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఒక దీవిలో పీవీ సింధు-వెంకట దత్తసాయి వివాహం జరిగింది. ఆరావళి పర్వతాల మధ్యలోని ఈ దీవిలో వంద గదులతో రఫల్స్‌ సంస్థ ఈ భారీ రిసార్ట్‌ను నిర్మించింది. అతిథులను పడవల్లో వివాహ వేదిక వద్దకు తీసుకెళ్లారు. వారికోసం 100 గదులను సింధు ఫ్యామిలీ బుక్ చేసినట్లు తెలుస్తోంది. ఈ రిసార్ట్‌లో ఓ గదికి ఒక రోజు అద్దె రూ.లక్ష ఉంటుందని సమాచారం.