News June 11, 2024
1, 2, 3, 4.. సౌతాఫ్రికా థ్రిల్లింగ్ విజయాలు

T20WCలో థ్రిల్లింగ్ విక్టరీలు సాధించడం సౌతాఫ్రికాకు పరిపాటిగా మారింది. 5 పరుగుల కంటే తక్కువ మార్జిన్లతో ఆ జట్టు నాలుగుసార్లు గెలిచింది. 2009లో న్యూజిలాండ్‌పై ఒక రన్, 2014లో అదే జట్టుపై 2, అదే ఏడాది ఇంగ్లండ్‌పై 3, ఈసారి బంగ్లాదేశ్‌పై 4 పరుగుల తేడాతో ప్రొటీస్ <<13417885>>విజయం<<>> సాధించింది. మరే ఇతర జట్టుకూ ఈ ఘనత సాధ్యం కాలేదు.
Similar News
News March 17, 2025
రేపు మేదరమెట్లకు వైఎస్ జగన్

AP: మాజీ సీఎం వైఎస్ జగన్ రేపు బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. మేదరమెట్లలో వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మ అంత్యక్రియల్లో ఆయన పాల్గొంటారు. ఆమె మృతదేహానికి నివాళులర్పించి కుటుంబసభ్యులను పరామర్శిస్తారు. మరోవైపు పార్లమెంట్ సమావేశాల్లో ఉన్న వైవీ సుబ్బారెడ్డి తల్లి మరణవార్త తెలియగానే హుటాహుటిన ఢిల్లీ నుంచి ఒంగోలుకు బయల్దేరారు.
News March 17, 2025
OTTలోకి వచ్చేసిన 5 ఆస్కార్‌లు గెలిచిన మూవీ

5 ఆస్కార్ అవార్డులు పొందిన రొమాంటిక్ కామెడీ మూవీ ‘అనోరా’ ఓటీటీలోకి వచ్చేసింది. జియో హాట్‌స్టార్‌లో ఈ సినిమా ఇంగ్లిష్, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. రష్యాలోని రిచ్ ఫ్యామిలీ యువకుడు USలో ఒక వేశ్యను ప్రేమ వివాహం చేసుకుంటాడు. ఈ విషయం తెలియడంతో అతడిని పేరెంట్స్ ఇంటికి తీసుకెళ్లిపోతారు. ఆ తర్వాత ఏం జరిగిందనేదే ఈ మూవీ కథ. ‘అనోరా’ ఒక లాటిన్ పదం. దీనికి తెలుగులో గౌరవం అని అర్థం.
News March 17, 2025
తప్పు మీది కాదు.. EVMలది: ఆర్కే రోజా

AP: మెడికల్ కాలేజీలకు మంగళం పాడిన కూటమి ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను ఎత్తేసిందని, ఇప్పుడు బడుల వంతు అని మాజీ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. ‘అయినా విద్య ప్రభుత్వ బాధ్యత కాదు అని ముందే మీరు చెప్పారు లేండి. తప్పు మీది కాదు.. తప్పంతా EVMలదే. 5 కిలోమీటర్ల పరిధిలో గ్రామంలో ఒకే పాఠశాల ఉండాలా? గ్రామంలో ఎన్ని బ్రాందీ, బెల్ట్ షాపులైనా ఉండొచ్చా?’ అని ప్రభుత్వాన్ని నిలదీస్తూ ట్వీట్ చేశారు.