News May 20, 2024

ఈక్విటీ మార్కెట్లో రూ.1.3 లక్షల కోట్ల పెట్టుబడులు

image

ఈక్విటీ మార్కెట్లలోకి పెట్టుబడుల వరద కొనసాగుతోంది. ఈ ఏడాది మే 16 నాటికి మ్యూచువల్ ఫండ్లు ఈక్విటీల్లోకి రూ.1.3 లక్షల కోట్లు ఇన్వెస్ట్‌మెంట్ చేశాయి. వృద్ధి అవకాశాలను దృష్టిలో పెట్టుకునే మదుపర్లు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. ఇదే సమయంలో విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీల నుంచి రూ.25వేల కోట్లకు పైగా వెనక్కి తీసుకున్నారు. మరోవైపు NSE నమోదిత కంపెనీల్లో MFల వాటా జీవితకాల గరిష్ఠం 8.92 శాతానికి చేరింది.

Similar News

News December 13, 2024

సినీ ఆర్టిస్టులను టార్గెట్ చేస్తున్నారు: కిషన్ రెడ్డి

image

అల్లు అర్జున్ అరెస్టును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. షో నిర్వాహకులు ముందుగానే పోలీసులకు సమాచారం ఇచ్చామని చెబుతున్న నేపథ్యంలో ఉద్దేశపూర్వకంగానే ఈ అరెస్టు జరిగినట్లు అర్థం అవుతోందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ బాధ్యత పోలీసులపై ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సినీ ఆర్టిస్టులను టార్గెట్ చేస్తోందనే విషయాన్ని ఈ అరెస్ట్ గుర్తుచేస్తోందని ట్వీట్ చేశారు.

News December 13, 2024

అల్లు అర్జున్‌కు కోర్టు కీలక ఆదేశాలు

image

సుదీర్ఘ వాదనల అనంతరం అల్లు అర్జున్‌కు 4 వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చిన హైకోర్టు సొంత పూచీకత్తు సమర్పించాలని ఆయనను ఆదేశించింది. ఈ కేసులో రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టును ఆశ్రయించాలంది. తదుపరి విచారణను JAN 11కు వాయిదా వేసింది. అలాగే క్వాష్ పిటిషన్‌పై విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ ఘటనలో సంధ్య థియేటర్ యాజమాన్యానికి ఇవే ఆదేశాలు వర్తిస్తాయని కోర్టు పేర్కొంది.

News December 13, 2024

బౌలర్‌ని కాదు.. బంతినే చూస్తాం: గిల్

image

ఆస్ట్రేలియాపై ఆడేందుకు భయపడట్లేదని భారత యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ వ్యాఖ్యానించారు. ‘గెలవకపోవడం వల్ల భయపడుతున్నామంటే అర్థం ఉంది. మేం చివరిగా ఇక్కడ ఆడినప్పుడు గెలిచాం. భారత్‌లోనూ ఆస్ట్రేలియాను ఓడించాం. బౌలింగ్ ఎవరు చేస్తున్నారన్నది మా జనరేషన్ పట్టించుకోదు. కేవలం బంతినే చూస్తుంది. ఓ టీమ్‌గా ఎలా పోరాడాలన్నదానిపైనే ప్రస్తుతం జట్టు దృష్టిపెట్టింది. మా దృష్టిలో ఇక ఇది 3 టెస్టుల సిరీస్’ అని పేర్కొన్నారు.